శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రిలీజ్

Published on Mon, 12/22/2025 - 18:02

గత కొన్నేళ్లుగా సరైన హిట్ అనేదే లేక ఇబ్బంది పడుతున్న తెలుగు హీరో శర్వానంద్.. ల్యాంగ్ గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'నారీ నారీ నడుమ మురారి' పేరుతో తీసిన సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది. తాజాగా టీజర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో శర్వా సరసన సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకుడు. అనిల్ సుంకర నిర్మించారు.

(ఇదీ చదవండి: పెళ్లిలో తెలుగు స్టార్ హీరో భార్యతో కీర్తి సురేశ్ డ్యాన్స్)

టీజర్ చూస్తుంటే కామెడీ బాగానే ఉంది. విజువల్స్, మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా అనిపించాయి. కాకపోతే సంయుక్త, నరేశ్, సునీల్ డబ్బింగ్ ఏదో తేడాగా అనిపించింది. ఆఫీస్‌లో ఓ అమ్మాయిని ప్రేమించిన హీరో, హీరోయిన్‌తో పెళ్లికి సిద్ధమవుతాడు. కానీ ఇతడి టీమ్ లీడర్‌గా మరో హీరోయిన్ వస్తుంది. ఈమెకి హీరోకి గతంలో లవ్ స్టోరీ ఉంటుంది. మరి ఇ‍ద్దరు హీరోయిన్లలో హీరో ఎవరిని పెళ్లి చేసుకున్నాడనేదే స్టోరీలా అనిపిస్తుంది.

సంక్రాంతి బరిలో దీనితో పాటు చాలా సినిమాలు ఉన్నాయి. జనవరి 9న ప్రభాస్ 'రాజాసాబ్' రానుంది. ఇదే రోజున తమిళ డబ్బింగ్ మూవీ 'జననాయగణ్' పోటీలో ఉంది. 10వ తేదీన మరో తమిళ డబ్బింగ్ సినిమా 'పరాశక్తి' విడుదల కానుంది. 12వ తేదీన 'చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు', 13న రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 14న నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' రిలీజ్ కానున్నాయి. మరి వీటితో పోటీపడి శర్వా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి?

(ఇదీ చదవండి: స్టార్ హీరో రెమ్యునరేషన్ ఎగ్గొట్టిన ప్రముఖ నిర్మాత)

Videos

పార్వతీపురంలో YS జగన్ పుట్టినరోజు వేడుకలు

ఆ మృతదేహం నాకొద్దు.. 8 రోజుల నుంచి మార్చురీలోనే మగ్గుతున్న డెడ్ బాడీ

దళితుడిని కొట్టిన కేసులో పోలీసులపై SC కమిషన్ చర్యలు

వామ్మో కోడి గుడ్డు! డబుల్ సెంచరీ దాటిన ట్రే

థియేటర్లు మొత్తం ఖాళీ.. ఇక చాలు కామెరూన్

రాహుల్, సోనియా గాంధీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

అనంతపురం ఆకుతోటపల్లిలో కాల్పులు

దొరికింది దోచుకోవడం తప్ప వీళ్ళు చేసిందేమీ లేదు

టీడీపీ నేతల వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య

గురజాలలో ఉద్రిక్తత

Photos

+5

దుల్కర్ సల్మాన్ పెళ్లిరోజు.. భార్య గురించి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి తర్వాత సమంత ఎలా మెరిసిపోతుందో చూశారా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోషన్, కమెడియన్ రఘు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో క్తీరి సురేశ్ హంగామా (ఫొటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రెస్ మీట్ లో డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)

+5

ఆది సాయికుమార్ ‘శంబాల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

బిగ్‌బాస్‌-9 విజేతగా కల్యాణ్‌.. ట్రోఫీతో ఎక్స్‌ కంటెస్టెంట్స్‌ (ఫోటోలు)

+5

బ్యాంకాక్ ట్రిప్‌లో తెలుగు సీరియల్ బ్యూటీ నవ్యస్వామి (ఫొటోలు)