Breaking News

బ్రేకప్‌ తర్వాత మళ్లీ కలిసిన దీప్తి సునయన- షణ్నూ

Published on Sat, 10/08/2022 - 11:06

యూట్యూబ్‌ స్టార్స్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌, దీప్తి సునయనల క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డ్యాన్స్‌ వీడియోలతో పాపులర్‌ అయిన ఈ ఇద్దరూ ఆ తర్వాత బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లుగా మరింత పాపులర్‌ అయ్యారు. కానీ అనూహ్యంగా షణ్నూ బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చాక వీరు బ్రేకప్‌ చెప్పేసుకోవడం సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ వీరిద్దరూ కలిస్తే బాగుండు అని ఫ్యాన్స్‌ తెగ కోరుకుంటున్నారు.

తాజాగా షణ్నూ-దీప్తిలు ఒకే వేదికపై కనిపించడం ఆసక్తిగా మారింది. వైజాగ్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో వీరిద్దరూ సందడి చేశారు. పక్కనే కూర్చున్న దీప్తిని చూస్తూ షణ్నూ సిగ్గుపడిపోయిన క్లిప్పింగ్స్‌ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా స్టేజ్‌పైన షణ్నూ దీప్తి గురించి మాట్లాడుతూ.. ''మొదట్లో నేను, దీప్తి సునయన కవర్‌ సాంగ్స్‌ చేసేటప్పుడు చాలా నెగిటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి.

ఆమెకు వచ్చినన్ని ట్రోల్స్‌ ఎవరికీ రాలేదేమో. కానీ అవి చూసి దీప్తి ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.నేను దీప్తీని చూసి చాలా నేర్చుకున్నాను. అలాగే అమ్మాయిలు దీప్తీని చూసి నేర్చుకోవాలి. మీరు కూడా ఒక ఇన్‌స్పిరేషన్ కావాలి” అంటూ షణ్నూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో వీరిద్దరూ మళ్లీ కలిసిపోయారా? త్వరలోనే ఆ గుడ్‌న్యూస్‌ షేర్‌ చేసుకుంటారా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 


 

Videos

పిడుగురాళ్ల CI వేధింపులకు మహిళ ఆత్మహత్యాయత్నం

చిరు, వెంకీ ఊరమస్ స్టెప్స్..!

ఆపరేషన్ సిందూర సమయంలో భారత్ దెబ్బకు పారిపోయి దాక్కున్నాం

హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్

అల్లాడిపోతున్నది అమ్మ మా అనిత.. పేర్నినాని ఊర మాస్ ర్యాగింగ్

ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..

ఒక్క బిడ్ రాలేదు.. జగన్ దెబ్బకు బొమ్మ రివర్స్.. పగతో రగిలిపోతున్న చంద్రబాబు

సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్

సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్

టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

Photos

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)