Breaking News

దీపికా పదుకొణెతో డ్యుయెట్‌కు నేను రెడీ!

Published on Thu, 10/23/2025 - 09:04

ప్రదీప్‌ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం డ్యూడ్‌ (Dude Movie). శరత్‌ కుమార్, రోహిణి, సిద్ధూ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కీర్తీశ్వరన్‌ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యేర్నేని, వై రవి శంకర్‌ నిర్మించారు. సాయి అభ్యంకర్‌ సంగీతాన్ని అందించారు. అక్టోబర్‌ 17వ తేదీన తమిళం, తెలుగు భాషల్లో విడుదల అయిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో దూసుకుపోతోంది. 

థాంక్స్‌ గివింగ్‌ మీట్‌
ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ బుధవారం మధ్యాహ్నం చెన్నైలో థాంక్స్‌ గివింగ్‌ మీట్‌ నిర్వహించింది. చిత్ర నిర్మాతలు నవీన్‌ యేర్నేని, రవి శంకర్‌ మాట్లాడుతూ డ్యూడ్‌ చిత్రం తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటకలోనే కాకుండా, ఉత్తరాదిలో, అమెరికాలోనూ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది అని పేర్కొన్నారు. ఇంత మంచి విజయాన్ని అందించిన దర్శకుడు కీర్తీ శ్వరన్, ప్రదీప్‌ రంగనాథన్, మమిత బైజు, శరత్‌ కుమార్‌ యూనిట్‌ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

దీపికాతో డ్యుయెట్‌కు రెడీ
డ్యూడ్‌ చిత్ర షూటింగ్‌కు వెళుతున్నామనగానే మనసులో సంతోషం కలిగేదని, అంత జాలీగా షూటింగ్‌ సాగిందని మమిత బైజు అన్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని ఇచ్చిన నిర్మాతలకు, దర్శకుడు, హీరోకు కృతజ్ఞతలు తెలిపారు. చక్కని సందేశంతో కూడిన యూత్‌ ఫుల్‌ లవ్‌ స్టొరీ డ్యూడ్‌ అని నటుడు శరత్‌ కుమార్‌ పేర్కొన్నారు. తాను ఇప్పుడు హీరోయిన్‌ దీపికా పదుకొణె (Deepika Padukone)తో డ్యుయెట్‌ పాడటానికి కూడా రెడీ అన్నారు. చాలా సెన్సిబుల్‌ కథను నిర్మించడానికి ముందుకొచ్చిన నిర్మాతలకు అభినందనలు తెలియజేశారు.

చదవండి: బ్రేకప్‌.. గుండెలోతులో బాధ.. : రష్మిక మందన్నా

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు