Breaking News

సంక్రాంతి పోరు.. బరిలో ‘ఆ నలుగురు’

Published on Tue, 09/30/2025 - 14:26

సంక్రాంతి పండగ టాలీవుడ్‌కి అతి ముఖ్యమైనది. యావరేజ్‌ సినిమా కూడా హిట్‌ అయ్యే అవకాశం ఈ పండక్కే ఉంది. ఒక వేళ హిట్‌ టాక్‌ వస్తే.. బాక్సాఫీస్‌ని షేక్‌ చేసేది కూడా పండగే. అందుకే సంక్రాంతికి రావాలని పలువురు స్టార్స్‌ ప్లాన్‌ చేసుకుంటారు. ఎప్పటి మాదిరే ఈ సారి కూడా టాలీవుడ్‌లో పొంగల్‌ పోరు గట్టిగానే ఉంది. ఇప్పటికే రెండు సినిమాలు డేట్స్‌ని ప్రకటించాయి. మరో రెండు చిత్రాలు కూడా పండగ కోసమే రెడీ అవుతున్నాయి. 

అందులో ఒకటి మెగాస్టార్‌ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్‌ గారు’(Mana Shankara Vara Prasad Garu) కూడా ఉంది. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ఈ మూవీ ట్యాగ్‌లైన్‌. ట్యాగ్‌లైన్‌ చూస్తేనే ఇది పక్కా సంక్రాంతి మూవీ అని అర్థమైపోతుంది. కానీ ఇప్పటి వరకు డేట్‌ మాత్రం ప్రకటించలేదు. మరోవైపు ప్రభాస్‌ ‘ది రాజాసాబ్‌’(The Raja Saab)తో జనవరి 9న వస్తున్నట్లు ప్రకటించాడు. అలాగే యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’తో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఇక మిగిలిన డేట్స్‌ 12, 13 మాత్రమే. ఈ రెండు రోజుల్లో ఏదొ ఒక రోజు చిరంజీవి(Chiranjeevi) సినిమా రావాల్సింది. మరోవైపు రవితేజ కూడా సంక్రాంతి సమరానికి సై అంటున్నాడు. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఓ చిత్రం సంక్రాంతికి రిలీజ్‌ అవుతుందని టాక్‌ నడుస్తుంది. దు జనవరి 13న రిలీజ్ డేట్ లాక్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జెట్‌ స్పీడ్‌తో జరుగుతోన్న షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తవుతుందని, ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి సంక్రాంతికి రంగంలోకి దించేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ లెక్కన చిరంజీవికి 12వ తేది తప్ప మరో ఆప్షన్‌ లేదు. 

దసరాకి ఈ సినిమా అప్‌డేట్‌ వస్తుంది. ఓ పాటను రిలీజ్‌ చేసే చాన్స్‌ ఉంది. అప్పుడైనా రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తారేమో చూడాలి. మొత్తానికి చిరంజీవి, ప్రభాస్‌, రవితేజ లాంటి స్టార్స్‌తో పాటు యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి కూడా పొంగల్‌ పోరులో ఉన్నాడు. మరీ వీరిలో ఎవరు పై చేయి సాధిస్తారో? ఏ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తుందో చూడాలి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)