Breaking News

కొడుకు సమక్షంలో బిగ్‌బాస్ బ్యూటీ మరో పెళ్లి

Published on Thu, 11/27/2025 - 14:44

ప్రముఖ నటి, తమిళ బిగ్‌బాస్ ఫేమ్ సంయుక్త షణ్ముగనాథన్ మరో పెళ్లి చేసుకుంది. దిగ్గజ క్రికెటర్ క్రిష్ణమాచారి కొడుకు అనిరుధ్ శ్రీకాంత్‌తో ఏడడుగులు వేసింది. చెన్నైలో గురువారం ఉదయం చాలా సింపుల్‌గా ఈ శుభకార్యం జరిగింది. తన కొడుకు సమక్షంలోనే సంయుక్త ఈ వివాహం చేసుకోవడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సంయుక్త విషయానికొస్తే.. తమిళంలో నటి-మోడల్‌గా కెరీర్ ఆరంభించింది. వరిసు, మై డియర్ భూతం, కారీ, తుగ్లక్ దర్బార్ తదితర సినిమాలు చేసింది. చంద్రముఖి సీరియల్‪‌లోనూ చేసింది. తమిళ బిగ్‌బాస్ 4వ సీజన్‌లో పాల్గొని మంచి ఫేమ్ తెచ్చుకుంది. గతంలో కార్తీక్ శంకర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ కొడుకు కూడా పుట్టాడు. తన భర్తతో మరో మహిళతో సంబంధం ఉందని తెలిసి సంయుక్త విడాకులు తీసుకుంది.

(ఇదీ చదవండి: ప్రియురాలిని పెళ్లాడిన సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌)

అనిరుధ్ శ్రీకాంత్ విషయానికొస్తే.. తండ్రి క్రిష్ణమాచారి శ్రీకాంత్‌లానే క్రికెట్‌ని కెరీర్‌లా ఎంచుకున్నాడు. తమిళనాడు తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఐపీఎల్‌లో 2008-13 వరకు సీఎస్కే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడాడు. 2019 తర్వాత నుంచి పెద్దగా క్రికెట్ ఆడట్లేదు. ఇతడు 2012లో మోడల్ ఆర్తి వెంకటేశ్‌ని పెళ్లి చేసుకున్నాడు. కానీ మనస్పర్థల కారణంగా రెండేళ్లకే విడిపోయారు.

ఈ ఏడాది దీపావళి సందర్భంగా సంయుక్త-అనిరుధ్ కలిసి ఫొటోలు పోస్ట్ చేశాడు. దీంతో ఏమై ఉంటుందా అని నెటిజన్లు మాట్లాడుకున్నారు. ఇప్పుడు అందుకు తగ్గట్లే పెళ్లి చేసుకుని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ జంటకు పలువురు నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లి ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Videos

దళిత IPSలపై వివక్ష.. CID చీఫ్ కు నోటీసులు

ఒక్కరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే.. పదేళ్ల జైలు శిక్ష..!

క్లైమాక్స్ కు కుర్చీ వార్!

అనంతపురం జిల్లాలో దారుణం.. కొడుకు గొంతుకోసి తల్లి ఆత్మహత్య..

తుఫాన్ అలర్ట్.. దూసుకొస్తున్న దిత్వా

మసిబొగ్గుల్లా భవనాలు.. మంటల్లో 300 మంది

అనుచరులతో మా ఇంటికొచ్చి..! బాధితురాలు సంచలన నిజాలు

మహిళ అని కూడా చూడకుండా చీర పట్టుకొని లాక్కెళ్లి.. కాళ్లతో తన్నుతూ..!!

దళారుల రాజ్యం! ధాన్యం కొనుగోలు గందరగోళం

నా ప్రాణాలు పోయినా.. నిన్ను మాత్రం.. కోటంరెడ్డికి నెల్లూరు మేయర్ భర్త ఛాలెంజ్

Photos

+5

స్వామి అయ్యప్ప పడిపూజలో వితికా షేరు దంపతులు

+5

సింపుల్‌గా మరింత అందంగా అనసూయ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ డైరెక్టర్ (ఫొటోలు)

+5

అరుణాచలంలో జబర్దస్త్ కమెడియన్ పంచ్‌ ప్రసాద్ ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

Rahul Sipligunj - Harinya Reddy : వైభవంగా సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ వివాహం (ఫొటోలు)

+5

దుబాయిలో చిల్ అవుతున్న అప్సరరాణి (ఫొటోలు)

+5

రాజన్న చైల్డ్‌ ఆర్టిస్ట్‌.. చీరకట్టులో ఎంత బాగుందో! (ఫోటోలు)

+5

‘ఆంధ్రా కింగ్ తాలూకా’మూవీ రిలీజ్ ట్రెండింగ్ లో భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

‘మరువ తరమా’ సినిమా ప్రీ రిలీజ్(ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)