Breaking News

ఆ డైరెక్టర్‌తో తిరుమలకు సమంత.. వీడియో వైరల్!

Published on Sun, 04/20/2025 - 16:50

టాలీవుడ్ ‍స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న సమంత.. ప్రస్తుతం నిర్మాతగా అభిమానుల ముందుకు రానుంది. ఆమె నిర్మించిన తాజా చిత్రం శుభం త్వరలోనే ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాలో హర్షిత్‌ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్‌ పేరి, శ్రియా కొంతం ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది.

ఇక సినిమాల సంగతి పక్కనపెడితే గత కొద్ది కాలంగా వ్యక్తిగత విషయాలతొనే వార్తల్లో నిలుస్తోంది. సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తర్వాత.. సమంతపై పెద్దఎత్తున రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ సిరీస్‌ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ నిడిమోరుతో సామ్ డేటింగ్‌లో ఉందంటూ చాలాసార్లు కథనాలొచ్చాయి. ఇటీవల పికిల్‌ బాల్‌ లీగ్‌లోనూ వీరిద్దరూ జంటగా కనిపించారు. ఆ తర్వాత కోలీవుడ్‌లో బీహైండ్‌వుడ్స్‌ అవార్డ్స్‌ ఫంక్షన్‌లో రాజ్‌ నిడిమోరు, సమంత సందడి చేశారు. కొంతకాలంగా ఈవెంట్స్‌లో కనిపించడంతో ఆ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని టాక్‌ కూడా వినిపిస్తోంది.

ఈ వార్తల నేపథ్యంలో సమంత, రాజ్ నిడిమోరు రిలేషన్‌షిప్‌ మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరు కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం సమంత, రాజ్‌ నిడిమోరు సంప్రదాయ దుస్తుల్లో తిరుమల వెంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. దీంతో మరోసారి వీరిద్దరి డేటింగ్‌పై చర్చ మొదలైంది. అయితే ఈ రూమర్స్‌పై ఇప్పటి వరకు సమంత, రాజ్ ఒక్కసారి కూడా స్పందించలేదు. వీరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ ఇప్పట్లో రూమర్స్ ఆగేలా కనిపించడం లేదు.

కాగా.. రాజ్‌ డైరెక్షన్‌లో సామ్ 'సిటాడెల్: హనీ బన్నీ, 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' (2021) అనే రెండు ప్రాజెక్ట్‌ల్లో నటించింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్' లోనూ సమంత నటిస్తోంది.  సమంత చివరిసారిగా వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్‌లో కనిపించింది.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)