సమంత రెండో పెళ్లి.. ఆమె ఆస్తుల విలువ అన్ని కోట్లా?

Published on Tue, 12/02/2025 - 16:23

ఎన్నో రోజులుగా వస్తున్న రూమర్స్ నిజమయ్యాయి. అందరూ ఊహించినట్లుగానే హీరోయిన్ సమంత రెండో సారి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అది కూడా మామూలుగా కాదు.. భూత శుద్ధి వివాహం పేరుతో ఇషా ఫౌండేషన్‌లో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో సమంత అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. బాలీవుడ్ డైరెక్టర్‌ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసిన సమంతకు అభినందనలు వెల్లువెత్తాయి. 2021లో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సామ్.. మరో పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించింది.

అయితే వీరిద్దరి పెళ్లి తర్వాత టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. కొందరేమో వీరి వయస్సుల గురించి చర్చిస్తే.. మరికొందరు డేటింగ్, పరిచయం ఎలా మొదలైంది అంటూ ఆరా తీస్తున్నారు. సమంత టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌ కావడం.. రాజ్ నిడిమోరు సైతం తెలుగువాడు కావడంతో బ్యాక్‌ గ్రౌండ్‌ గురించి తెగ వెతికేస్తున్నారు. అదే క్రమంలో సామ్-రాజ్ ఆస్తులు కూడా హాట్ టాపిక్‌గా మారాయి. ఎవరికెంత ఆస్తులున్నాయి?.. ఇద్దరిలో ఎవరికీ ఎక్కువ ఉన్నాయని నెటిజన్స్‌ చర్చించుకుంటున్నారు. ఆ వివరాలేంటో మనం కూడా చూసేద్దాం.

ఏ మాయ చేశావే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత.. కొద్ది కాలంలోనే స్టార్‌ హోదాను సొంతం చేసుకుంది. తెలుగులో అగ్రహీరోల సరసన వరుసపెట్టి సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే దక్షిణ భారత సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకునే హరోయిన్లలో ఒకరిగా నిలిచింది. సమంత ఒక్కో సినిమాకు రూ.3-5 కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రకటనల ద్వారా భారీగానే సంపాదించింది సామ్. పలు టాప్ కంపెనీలకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు. దీంతో ఓవరాల్‌గా డిసెంబర్ 2025 నాటికి సమంత ఆస్తుల విలువ దాదాపు రూ.110 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం.

సమంత ఆస్తులే ఎక్కువ.. 

ఇక రాజ్ నిడిమోరు ఆస్తుల విషయానికొస్తే బాగానే వెనకేసినట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం రాజ్ నిడిమోరు ఆస్తుల విలువ దాదాపు రూ.85 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన రాజ్ కంటే సమంతనే 29 శాతం అధికంగా ఆస్తులు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వీరిద్దరి ఆస్తులను కలిపితే ఏకంగా రూ.200 కోట్ల వరకు ఉంటుందని నెటిజన్స్‌ అంచనా వేస్తున్నారు.

కాగా.. వీరిద్దరు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీలో కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ‍ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట డిసెంబర్ 1న వివాహబంధంలోకి అడుగుపెట్టింది.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)