Breaking News

ఓటీటీలోకి సమంత ‘శుభం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published on Sun, 06/01/2025 - 12:50

సమంత నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం శుభం(Subham). ఇటీవల థియేటర్లో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.  ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ మూవీలో హర్షిత్‌ ‌రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్‌, చరణ్‌ పెరి నటించారు. మే 09న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి తొలి రోజే పాజిటివ్‌ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాలో సమంత అతిథి పాత్రలో మెరిసింది. 

తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ నెల 13 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ సంస్థ పోస్టర్‌ను షేర్ చేసింది. 

శుభం కథేంటంటే..

వైజాగ్‌లోని భీమిలీపట్నంలో నివసించే ముగ్గురు యువజంటల కథ ఇది. శ్రీను(హర్షిత్‌రెడ్డి)‘మన టౌన్ కేబుల్ టీవీ’ ఆపరేటర్‌. అతని స్నేహితులు(గవిరెడ్డి శ్రీనివాస్‌, చరణ్‌ పేరీ)లకు అల్రేడీ పెళ్లి అయిపోతుంది. భార్యలను ఫరిదా, గాయత్రి(శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి) చెప్పుచేతల్లో పెట్టుకోవడమే కాకుండా.. బ్యాచిలర్‌ అయిన శ్రీనుకి కూడా అదే విషయాన్ని ఎక్కిస్తారు. శ్రీనుకి అదే ప్రాంతానికి చెందిన శ్రీవల్లీ(శ్రియ కొంతం)తో పెళ్లి జరుగుతుంది. స్నేహితులు చెప్పిన మాటలతో పెళ్లాన్ని హద్దుల్లో పెట్టుకోవాలని శ్రీను కూడా డిసైడ్‌ అయిపోతాడు. ఫస్ట్‌నైట్‌ రోజు శ్రీవల్లీ శోభనం గదిలోకి రాగానే అసలు ట్విస్ట్‌ మెదలవుతుంది. రాత్రి 9గంటలు కాగనే శ్రీవల్లి టీవీ ఆన్‌ చేసి ‘జన్మజన్మల బంధం’ సీరియల్‌ చూస్తుంది.

ఈ టైంలో సీరియల్‌ చూడడం ఏంటని శ్రీను అడిగితే..దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తుంది. మరుసటి రోజు కూడా ఇలానే వింతగా ప్రవర్తిసు​ంది. ఇది తన ఒక్కడి సమస్యే అనుకుంటాడు. కానీ తన స్నేహితులిద్దరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లు తర్వాత తెలుసుకుంటాడు. ఈ ముగ్గురు మాత్రమే కాదు.. ఊరు మొత్తం ఇదే సమస్య ఉందనే విషయం బయటపడుతుంది. అసలు ఆ సీరియల్‌కి ఊర్లోని ఆడవాళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? సీరియల్‌ టైం కాగానే ఎందుకు వాళ్లు దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు? మాతాజీ మాయ(సమంత) వాళ్ల సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపింది? అనేది తెలియాలంటే ‘శుభం’ సినిమా చూడాల్సిందే. 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)