Breaking News

'చిన్నప్పుడు ఎన్నో కష్టాలు.. నా బిడ్డకు అలా జరగకూడదు': సమంత

Published on Mon, 06/22/2026 - 20:49

టాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుతం మా ఇంటి బంగారం సక్సెస్ ఎంజాయ్ చేస్తోంది. జూన్ 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. కేవలం రిలీజైన మూడు రోజుల్లోనే ఏకంగా రూ.43 కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టింది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించగా.. సామ్ తన సొంత బ్యానర్‌లోనే నిర్మించింది. ఈ చిత్రంలో యాంకర్ శ్రీముఖి ప్రత్యేక పాత్రలో మెరిసింది. ఇదిలా ఉంటే సామ్‌పై కొన్ని రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆమె ప్రెగ్నెన్సీతో ఉందంటూ వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి.  

గత ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. 'నా బిడ్డే నా ప్రపంచం అవుతుంది. ఉద్యోగం చేసుకుంటూ పిల్లలను, ఇంటి బాధ్యతలను చూసుకునే మహిళంటే నాకెంతో గౌరవం.  నా చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డా. అలాంటి బాల్యం గడిపిన వారంతా వారి పిల్లలకు లగ్జరీ జీవితాన్ని ఇవ్వాలనుకుంటారు. ఇప్పుడు నేను కూడా అదే నిర్ణయించుకున్నా. నా బిడ్డ పుట్టిన తర్వాత కొన్నేళ్ల పాటు తనను వదిలి ఎక్కడికీ వెళ్లను. తనే నా సర్వస్వంగా చూసుకుంటా' అని అన్నారు.

కాగా.. సామ్ ఇటీవల మూవీ ప్రమోషన్స్‌లో శారీలో కనిపించారు. బేబీ బంప్‌తో ఉండడం వల్లే ఆమె అలా ఈవెంట్స్‌కు హాజరయ్యారని నెటిజన్స్ భావిస్తున్నారు. సమంత- రాజ్ త్వరలోనే గుడ్ న్యూస్‌ చెబుతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 
 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)