హీరోల వల్ల కానిది సమంత చేసి చూపించింది

Published on Mon, 06/22/2026 - 13:02

ఏదైనా సినిమా సరిగా ఆడకపోతే పలువురు తెలుగు దర్శకనిర్మాతలు.. నెపం ప్రేక్షకులు మీద లేదంటే రివ్యూయర్ల మీద తోసేస్తుంటారు. అంతే తప్పితే తాము సరిగా తీయలేదు, అందుకే ఆడలేదు, కలెక్షన్స్ రాలేదని మాత్రం ఒప్పుకోరు. ఇప్పుడు అలాంటి వాళ్లందరికీ సమంత చిన్నపాటి షాక్ ఇచ్చింది. ఎందుకంటే బంగారం ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లతో బరువెక్కుతోంది. ఇంతకీ ఇదెలా సాధ్యమైంది?

(ఇదీ చదవండి: శ్రీలీలని సీఎం భార్య అవమానించారా? వీడియో వైరల్)

ఒకప్పుడు సమంత స్టార్ హీరోయిన్. ప్రస్తుతానికి వస్తే హీరోయిన్‌గా ఓ సినిమా చేసి మూడేళ్లయింది. అది(ఖుషి) కూడా ఏమంత సరిగా ఆడలేదు. దీంతో 'మా ఇంటి బంగారం' ఆడుతుందా లేదా అనే విడుదలకు ముందు చాలా సందేహాలు. మరోవైపు జూన్ నెల మధ్యలో రిలీజ్, స్కూల్స్ తెరిచేశారు. ఫ్యామిలీ ఆడియెన్స్ వస్తారా అని డౌట్స్. దీనికి తోడు రివ్యూలు కూడా యావరేజ్‌గానే వచ్చాయి. కానీ సమంత తన మూవీపై అందరి అంచనాల్ని తారుమారు చేసింది. వీకెండ్ అయ్యేసరికి రూ.43 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

ప్రస్తుతం సినిమాల పరిస్థితి ఏం బాగోలేదు. ఓ మాదిరిగా ఆడిన మూవీస్ రూ.20-30 కోట్లు కూడా రాబట్టుకోలేకపోతున్నాయి. అలాంటిది హీరోలెవరూ లేకుండా సమంత మాత్రమే లీడ్ రోల్ చేసిన చిత్రానికి ఈ రేంజ్ వసూళ్లు రావడం నిజంగా ఆశ్చర్యమనే చెప్పొచ్చు. ఇది చూసి చాలామంది మిడ్ రేంజ్ హీరోలు కచ్చితంగా కళ్లుకుంటారేమో. ఎందుకంటే తమకు సాధ్యం కానిది ఓ హీరోయిన్ చేసి చూపించింది. దీనిబట్టి అర్థమైంది ఏంటంటే కంటెంట్ ఓ మాదిరిగా ఉన్నా జనాలు ఆదరిస్తారు. కాకపోతే అవసరం ఆర్భాటాలు లేకుండా కరెక్ట్‌గా తీయాలంతే. దర్శకనిర్మాతలు ఇది గుర్తుపెట్టుకుంటే బెటర్.

మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ అంటే అనుష్క 'అరుంధతి'కి రూ.68 కోట్లు వచ్చాయి. 'మా ఇంటి బంగారం' జోరు చూస్తుంటే ఈ నంబర్ దాటేసేలా కనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే రికార్డ్ అవుతుంది. ఈ మూవీతో సక్సెస్ అందుకున్న సమంత ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. అధికారికంగా చెప్పనప్పటికీ బేబీ బంప్ వీడియోలు వైరల్ కావడంతో ఈ సంగతి బయటపడింది. 

(ఇదీ చదవండి: సంధ్య థియేటర్ కేసు.. అల్లు అర్జున్‌కి మెమో)

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)