జీవితంలో ఎవర్నీ నమ్మననుకున్నా.. అలాంటిది రాజ్‌ వచ్చాక!

Published on Mon, 02/23/2026 - 15:55

'ఏమాయ చేసావె' సినిమాతో కథానాయికగా ప్రయాణం మొదలుపెట్టింది సమంత. తొలి సినిమా హీరో నాగచైతన్యతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. కానీ తర్వాత విభేదాలు రావడంతో 2021లో విడాకులు తీసుకున్నారు. దాదాపు నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత 2025 డిసెంబర్‌ 1న బాలీవుడ్‌ డైరెక్టర్‌ రాజ్‌ నిడిమోరును ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే జీవితంలో మరో వ్యక్తిని నమ్ముతానని అనుకోలేదంటోంది సామ్‌.

అతడి వల్లే ఇలా ఉన్నా
తాజాగా వోగ్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. నేను విడాకులు తీసుకున్నప్పుడు పూర్తిగా సైలెంట్‌ అయిపోయాను. భవిష్యత్తులో మరో వ్యక్తిని నమ్ముతానని కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే అప్పుడు నేను మానసికంగా చాలా బలహీనంగా ఉన్నాను. ఎవరి ప్రేమ, స్నేహాన్ని స్వీకరించే పరిస్థితిలో లేను. అలాంటిది నా జీవితంలోకి రాజ్‌ రావడం సంతోషంగా ఉంది. అతడు వచ్చాకే నాలో తెలియని శక్తి వచ్చింది. రాజ్‌ వల్లే నేనిప్పుడు బెటర్‌ పర్సన్‌గా మారాను. 

ఈ మధ్యే ఫ్రెండ్‌ను కలిశా..
ఇటీవలే నా పాత ఫ్రెండ్‌ను కలిశాను. ఆమె నాతో మాట్లాడి వెళ్లిపోయాక నాకు వాయిస్‌ మెసేజ్‌ పెట్టింది. ఒకప్పుడు నువ్వు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిపడేదానివి. చాలాకాలం తర్వాత మళ్లీ మామూలుగా కనిపిస్తున్నావ్‌ అని మెసేజ్‌ పెట్టింది (నవ్వుతూ) అని చెప్పుకొచ్చింది. మొత్తానికి రాజ్‌ వచ్చాక తన జీవితం సంతోషకరంగా మారిందంటోంది సామ్‌. ఈ ఆనందం తనకు జీవితాంతం వెన్నంటే ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 

 

చదవండి: చేతిలో చిల్లిగవ్వ లేక.. ప్రతిరోజూ కన్నీళ్లే: బాలీవుడ్‌ నటుడు

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)