Breaking News

సమంత క్రేజీ ఛాలెంజ్.. వీడియో వైరల్

Published on Tue, 07/29/2025 - 15:07

టాలీవుడ్ హీరోహీరోయిన్లలో చాలామంది ఫిట్‌నెస్ ఫ్రీక్స్ ఉన్నారు. అంటే షూటింగ్స్, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాసరే ప్రతిరోజూ జిమ్‌కి వెళ్తుంటారు. ఇలాంటి వారిలో హీరోయిన్ సమంత ఒకరు. గతంలో చాలాసార్లు జిమ్ వీడియోలు పోస్ట్ చేసేది. 100 కిలోలకు పైనే బరువులు ఎత్తిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మరో కొత్త ఛాలెంజ్‌లో పాల్గొంది. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

'టేక్ 20 హెల్త్' పేరుతో పాడ్ కాస్ట్ సిరీస్ చేస్తున్న సమంత.. ఆరోగ్యం, ఫిట్‌నెస్ గురించి వీడియోలు పోస్ట్ చేస్తోంది. తాజాగా 'డెడ్ హ్యాంగ్' ఛాలెంజ్ పూర్తి చేసింది. అంటే 90 సెకన్ల పాటు ఓ రాడ్‌కి వేలాడాల్సి ఉంటుంది. ఇందులో సమంతతో పాటు మరో ఇద్దరు కూడా పాల్గొన్నారు. వీళ్లంతా దాన్ని పూర్తి చేశారు కూడా.

(ఇదీ చదవండి: 'భోళా..' దెబ్బకొట్టినా మణిశర్మ కొడుక్కి బంపరాఫర్!)

'మీరు ఎలా కనిపిస్తున్నారనేది ముఖ్యం కాదు. మీ వారసత్వం ఏంటనేది కూడా ముఖ్యం కాదు. సెల్ఫీలు షేర్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ కాదు. ఎవరూ చూడనప్పుడు మీరు ఎంత బలంగా ఉన్నారనేదే ముఖ్యం' అని సామ్ వీడియోకు క్యాప్షన్ పెట్టింది. అయితే ఈ వీడియో సమంత లుక్ చూసి నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత బక్కగా అయిపోయిందేంటి అని మాట్లాడుకుంటున్నారు.

కెరీర్ పరంగా సమంత చేతిలో కొత్త సినిమాలేం చేయట్లేదు. 'రక్త్ బ్రహ్మాండ్' అనే వెబ్ సిరీస్ లైన్‌లో ఉంది గానీ ఇది ఆగిపోయిందనే రూమర్స్ వస్తున్నాయి. రీసెంట్‌గా నిర్మాతగా చేసిన తొలి మూవీ 'శుభం' రిలీజైంది. యావరేజ్ టాక్ తెచ్చుకుంది. త్వరలో నిర్మాత కమ్ హీరోయిన్ గా ఓ మూవీ మొదలుపెట్టనుందని, నందిని రెడ్డి దర్శకురాలు అని టాక్ నడుస్తోంది. నిజమేంటనేది తెలియాల్సి ఉంది. అలానే దర్శకుడు రాజ్‌తో సమంత డేటింగ్‌లో ఉందనే  పుకార్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీతో మెగా కోడలు.. కొత్త సినిమా టీజర్ రిలీజ్)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)