Breaking News

పెళ్లిరోజు.. భార్యకు ఊహించని బహుమతిచ్చిన హీరో విజయ్‌ తండ్రి

Published on Thu, 04/24/2025 - 17:41

పుట్టినరోజు, పెళ్లి రోజు వచ్చిందంటే చాలు.. భార్యాభర్తలు ఏదో ఒక బహుమతి ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ దర్శకుడు కూడా అదే పని చేశాడు. కాకపోతే 79 ఏళ్ల వయసులోనూ పెళ్లిరోజును గుర్తుపెట్టుకుని మరీ సతీమణికి ప్రేమగా బహుమతివ్వడం అందర్నీ ఒకింత ఆశ్చర్యపరుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ (S A Chandrasekhar).

ప్రముఖ డైరెక్టర్లు ఈయన దగ్గర పనిచేసినవాళ్లే
ఈ కోలీవుడ్‌ డైరెక్టర్‌.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని దాదాపు 70 సినిమాలు తెరకెక్కించాడు. తెలుగులో చట్టానికి కళ్లు లేవు, పల్లెటూరి మొనగాడు, దోపడి దొంగలు, దేవాంతకుడు వంటి చిత్రాలను రూపొందించాడు. డైరెక్టర్‌గానే కాకుండా నటుడిగా పలు చిత్రాల్లో యాక్ట్‌ చేశాడు. ఈయన దగ్గర సెంతిల్‌నాథన్‌, సి.రంగనాథన్‌, పవిత్రన్‌, ఎస్‌.శంకర్‌, ఎం. రాజేశ్‌ సహా పలువురు డైరెక్టర్లు అసిస్టెంట్‌గా పనిచేశారు.

BMW కారు గిఫ్ట్‌
చంద్రశేఖర్‌.. తన కుమారుడు విజయ్‌ (Vijay)ను హీరోగా వెండితెరకు పరిచయం చేశాడు. ఇప్పుడతడు దళపతిగా రాజకీయాల్లోనూ అడుగుపెట్టిన విషయం తెలిసిందే! చంద్రశేఖర్‌ భార్య పేరు శోభ. తాజాగా వీళ్లు పెళ్లిరోజు సెలబ్రేట్‌ చేసుకున్నారు. అంతేకాదు భాగస్వామికి వెడ్డింగ్‌ యానివర్సరీ గిఫ్ట్‌గా కారు ఇచ్చానంటూ ఓ వీడియో షేర్‌ చేశాడు. బీఎమ్‌డబ్ల్యూ కారు కొన్న చంద్రశేఖర్‌.. అందులో భార్యను ఎక్కించుకుని డ్రైవ్‌ చేశాడు. ఇది చూసిన అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

 

చదవండి: పాకిస్తాన్‌ సైన్యంలో ఫౌజీ హీరోయిన్‌ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)