Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..
Breaking News
శ్రీకాంత్ తనయుడి లేటేస్ట్ మూవీ.. టైటిల్ సాంగ్ వచ్చేసింది
Published on Tue, 09/29/2026 - 15:48
శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా నటిస్తోన్న తాజా చిత్రం ఏమో ఏమో ఇది. ఈ మూవీలో ప్రీతి ముకుందన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని రొమాంటిక్ అండ్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు.
(ఇది చదవండి: మనవరాలికి గ్రాండ్ వెల్కమ్.. టాలీవుడ్ విలన్ వీడియో చూశారా?)
యూత్ నేపథ్యంలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. నేటి యువతరాన్ని ఆకట్టుకొనే లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఏమో ఏమో ఇది అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ కంపోజ్ చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. కార్తిక్, రమ్య బెహ్రా ఆలపించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ రొమాంటిక్ సాంగ్ మీరు కూడా వినేయండి.
Tags : 1