మొత్తం బరితెగించి పోయారు.. తిరుపతి ప్రతిష్టను చంద్రబాబు మంట కలిపారు..
Breaking News
కరుప్పు ఫస్ట్ విజయ్‌కే చెప్పా.. ఆయనకు నచ్చింది.. కానీ!
Published on Mon, 03/23/2026 - 12:01
స్టార్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రాల్లో కరుప్పు ఒకటి. అయితే ఈ ప్రాజెక్ట్ సూర్య కంటే ముందు దళపతి విజయ్ చేతికి వెళ్లిందట. ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రజనీకాంత్ కెరీర్‌లో భాష, ముత్తు, పడయప్ప (నరసింహ) వంటి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇప్పటికీ చాలామంది జనాలు వీటిని మళ్లీ మళ్లీ చూస్తుంటారు.
2023లోనే..
అలాంటి ఒక ఫుల్ ఎంటర్‌టైనర్ సినిమాని తీయాలని నా కోరిక. యాక్టింగ్ అంటే గట్టిగా అరవడం, ఏడవడం కాదు. అన్ని రకాల ఎమోషన్స్‌ను సమపాళ్లలో పండించాలి. అది సూర్యకు వెన్నతో పెట్టిన విద్య.. తను బాగా డ్యాన్స్ చేస్తాడు, అద్భుతంగా నటిస్తాడు, ఏదైనా సింపుల్‌గా చేసేస్తాడు. తన స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంటుంది. నిజానికి 2023లో కరుప్పు కథ రాయడం మొదలుపెట్టాను.
విజయ్‌కు కథ చెప్పా..
ఈ కథకు బలమైన స్టార్ ఉంటే బాగుంటుందనిపించింది. అలా హీరో విజయ్‌ను కలిశాను.. పైగా ఆయన 2021లోనే ఏదైనా కథ ఉంటే చెప్పమని అడిగాడు. ఈ రెండు కారణాల వల్ల తనను కలిశాను. కరుప్పు విజయ్‌కు చాలా బాగా నచ్చింది. ఇది భారీ సినిమా.. వెంటనే మొదలుపెడదాం అన్నారు. కానీ విజయ్ వంటి స్టార్ హీరోతో సినిమా తీయడం అంటే పెద్ద బాధ్యత..
నచ్చింది కానీ..
అలా హడావుడిగా మొదలుపెట్టలేనని చెప్పాను. తర్వాత కొన్నిసార్లు కలిశాం, మాట్లాడుకున్నాం.. కానీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆయన నా నుంచి కుటుంబ కథా చిత్రం ఆశించాడు. అయినప్పటికీ ఈ కథ తనకెంతో నచ్చింది.. అదే సంతోషం అని ఊరుకున్నాను. తర్వాత సూర్యను సంప్రదించగా ఆయన ఓకే చెప్పాడు అని తెలిపాడు.
సినిమా
కరుప్పు విషయానికి వస్తే.. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తోంది. స్వాశిక, ఇందిరన్స్, యోగిబాబు, శివదా, సుప్రీత్ రెడ్డి, అనకా, మాయారవి, నట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్. ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. రిలీజ్ డేట్ ప్రకటించాల్సి ఉంది.
చదవండి: ధురంధర్ 2 ప్రభంజనం.. 28 ఏళ్ల కిందటి లేఖ వైరల్
Tags : 1