Breaking News

ప్రభాస్ 'రాజాసాబ్'లో ఛాన్స్.. ప్రాంక్ అనుకున్నా

Published on Wed, 11/26/2025 - 11:45

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఓ నటి మాత్రం.. హీరోయిన్ అవకాశం ఇవ్వడం కోసం ఫోన్ చేస్తే ప్రాంక్ అనుకుంది. తర్వాత ఎంక్వైరీ చేసి నమ్మకం తెచ్చుకుంది. ఈ మొత్తం విషయాన్ని స్వయంగానే సదరు నటి బయటపెట్టింది. ఆ మూవీ 'రాజాసాబ్' కాగా.. నటి పేరు రిద్ధి కుమార్. ఇంతకీ అసలేం జరిగింది?

మహారాష్ట్రకు చెందిన రిద్ధి కుమార్.. 'లవర్' అనే తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయింది. 2018లో వచ్చిన ఈ మూవీలో రాజ్ తరుణ్ హీరో. దీని తర్వాత మలయాళ, మరాఠీ భాషల్లో తలో మూవీ చేసింది గానీ పెద్దగా గుర్తింపు రాలేదు. 2022లో వచ్చిన 'రాధేశ్యామ్'లో అతిథి పాత్రలో కనిపించింది. అనంతరం హిందీలో ఒకటి రెండు మూవీస్ చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన 'రాజాసాబ్' విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా రిద్ధి చేసింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా)

''రాజాసాబ్' చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎస్కేన్.. నాకు ఓసారి కాల్ చేశారు. మేం ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తున్నాం. నిన్ను హీరోయిన్‌గా అనుకుంటున్నాం అని చెప్పారు. మొదట ఇదంతా నేను నమ్మలేదు. ప్రాంక్ చేస్తున్నారేమో అనుకున్నా. మా మేనేజర్‍‪‌ని ఫోన్ చేసి కనుక్కుంటే నిజమని క్లారిటీ వచ్చింది. తర్వాత లుక్ టెస్ట్, ఆడిషన్ చేసి నన్ను తీసుకున్నారు' అని రిద్ధి కుమార్.. 'రాజాసాబ్'లో అవకాశం ఎలా వచ్చిందో చెప్పుకొచ్చింది.

ప్రభాస్ నటించిన ఈ ఫాంటసీ కామెడీ మూవీకి మారుతి దర్శకత్వం వహించారు. రిద్ధి కుమార్‌తో పాటు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. లెక్క ప్రకారం డిసెంబరు 5న థియేటర్లలోకి రావాలి. కానీ వాయిదా వేశారు. జనవరి 9న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రీసెంట్‪‌గా తొలి పాట రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్‌తో పాటు రిద్ధి కుమార్ కనిపించింది.

(ఇదీ చదవండి: ఇంతకన్నా అవమానం ఉంటుందా?: 'రాజు వెడ్స్‌ రాంబాయి' నిర్మాత ఎమోషనల్‌)

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)