Breaking News

'మీ అన్న కొడుకా? అకీరా నా కొడుకు'.. పవన్‌ ఫ్యాన్స్‌పై రేణు దేశాయ్‌ ఫైర్‌'

Published on Sun, 04/09/2023 - 09:04

పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ గురించి ప్రత్యకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 'బద్రి' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఆమె దర్శకురాలిగా అలరిస్తున్నారు. 2012లో పవన్‌కల్యాణ్‌-రేణు దేశాయ్‌ విడాకులు తీసుకోగా, అప్పట్నుంచి ఆమె సింగిల్‌గానే ఉంటున్నారు. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణు దేశాయ్‌ తాజాగా పవన్‌కల్యాణ్‌ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంతకీ ఏమైందంటే.. నిన్న(ఏప్రిల్‌8)న కొడుకు అకీరా నందన్‌ పుట్టినరోజు సందర్భంగా మెగా హీరోలు సహా పలువురు అభిమానులు అకీరాకు బర్త్‌డే విషెస్‌ను తెలియజేశారు. అయితే కొందరు ఫ్యాన్స్‌ మాత్రం హద్దు దాటి ప్రవర్తించడంతో రేణు దేశాయ్‌ తన స్టైల్‌లో కౌంటర్‌ ఇచ్చింది.  "మేడమ్. ఇది చాలా అన్యాయం. మా అకీరాను ఒక్కసారి అయినా చూపించండి. మా అన్న(పవన్‌ కల్యాణ్‌)కొడుకును చూడాలని మాకు ఉంటుంది. మీరు హైడ్ చేయకండి.

అప్పుడప్పుడు అయినా వీడియోస్‌లలో అకీరా బాబును చూపించండి'' అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. దీనికి రేణు దేశాయ్‌ బదులిస్తూ..'మీ అన్న కొడుకా? అకీరా నా కొడుకు.మీరు ఒక తల్లికి పుట్టలేదా. మీరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని నేను అర్థం చేసుకోగలను. కానీ, కొంచెం మాట్లాడే పద్ధతి నేర్చుకోండి.

చాలావరకు ఇలాంటి కామెంట్స్‌ను డిలీట్‌ చేస్తూ వస్తున్నాను. కానీ కొందరు హద్దుదాటి చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. నా కొడుకు బర్త్‌డే రోజున ఇలాంటి కామెంట్స్‌ చదవడం బాధేస్తోంది. 11 ఏళ్లుగా నన్ను ఒక చెడ్డదానిలా, విలన్‌గా చూస్తున్నారు. ఇదంతా చూసిచూసి నేను విసిగిపోయాను' అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)