Breaking News

రణ్‌వీర్ సింగ్‌కు బిగ్ రిలీఫ్

Published on Wed, 06/03/2026 - 15:24

బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనపై విధించిన నాన్ కో ఆపరేషన్‌(సహాయ నిరాకరణ) ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు ఫెడరేషన్‌ ఆఫ్ వెస్ట్రర్న్ సినీ ఎంప్లాయిస్ యూనియన్(ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) ప్రకటించింది.  ఈ విషయాన్ని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ అధ్యక్షుడు బీఎన్ తివారీ ప్రకటించారు. సినీ కార్మికుల సంఘాలు, నిర్మాతల మండలి అభ్యర్థన మేరకు రణవీర్ సింగ్‌పై విధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. రణ్‌వీర్ లీగల్ నోటీసులు పంపిన అనంతరం అతనిపై నిషేధం తొలగించారు.

మొదట డాన్-3 మూవీ విషయంలో తలెత్తిన వివాదంతో రణ్‌వీర్ సింగ్‌పై నిషేధం విధించారు. ఫర్హాన్ అక్తర్ 'డాన్ 3' ప్రాజెక్ట్ నుంచి రణ్‌వీర్ సింగ్ అర్ధాంతరంగా తప్పుకోవడంతో వివాదం మొదలైంది. తనపై నిషేధాన్ని తొలగించాలని రణ్‌వీర్ కోరాడని ఫెడరేషన్ ముఖ్య సలహాదారు, ఫిల్మ్ మేకర్ ‍అశోక్ పండిట్ వెల్లడించారు. ఈ వివాదంపై డాన్-3 మేకర్స్‌తోనే చర్చించుకోవాలని రణ్‌వీర్‌కు చెప్పామని తెలిపారు. ఈ విషయంలో అతని నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. అయితే రణ్‌వీర్ సింగ్ పంపిన లీగల్ నోటీసుకు చట్టపరమైన మార్గాల ద్వారానే స్పందిస్తామని కూడా ఫెడరేషన్ తెలిపింది.

మరోవైపు ఏ కళాకారుడిపైనా నిషేధం విధించే అధికారం ఫెడరేషన్‌కు లేదని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ ముఖ్య సలహాదారు అశోక్ పండిట్ అన్నారు. దయచేసి నిషేధం అనే పదాన్ని ఉపయోగించవద్దని ఆయన మీడియాను కోరారు. ఒక వ్యక్తితో కలిసి పనిచేయవద్దని తన సభ్యులకు కేవలం సలహా మాత్రమే ఇవ్వగలదని తెలిపారు. ఎవరినీ వారి వృత్తిని కొనసాగించకుండా నిరోధించలేదని స్పష్టం చేశారు. రణ్‌వీర్ సింగ్ పంపిన నోటీసును ఫెడరేషన్ న్యాయ బృందం పరిశీలిస్తోందని.. దీనికి న్యాయ మార్గాల ద్వారా స్పందిస్తామని పండిట్ వెల్లడించారు.  ఎఫ్‌డబ్ల్యూఐసీఈ చర్చలకు సిద్ధంగా ఉందని.. ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి రణ్‌వీర్‌ సింగ్ కూడా చర్చలో పాల్గొంటారని ఆశిస్తున్నామని తెలిపారు.  ఇకనైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్‌ పడుతుందేమో వేచి చూడాల్సిందే.

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)