Chintada Ravi: దేశ ప్రతిష్టను పాతాళానికి తొక్కేసాడు ఇండిగో సంక్షోభంపై రామ్మోహన్ నాయుడును ఏకిపారేసిన చింతాడ రవి
Breaking News
దురంధర్ బాక్సాఫీస్.. అంచనాలను మించిపోయిన వసూళ్లు..!
Published on Sun, 12/07/2025 - 13:21
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. ఈ చిత్రం ఇటీవల డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఈ శుక్రవారం రిలీజైన దురంధర్ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.
ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ విడుదలైన రెండు రోజుల్లో రూ.60 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. మొదటి రోజు రూ.27 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు వీకెండ్ కలిసి రావడంతో రూ.33 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక దేశవ్యాప్తంగా రూ.72 కోట్ల గ్రాస్ రాగా.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.88 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. శనివారం రాత్రి షోల్లో 63 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఆదివారం రోజు వరల్డ్ వైడ్ వందకోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దురంధర్ ఉహించినా దానికంటే అధిక కలెక్షన్స్ రాబడుతోంది. దీంతో మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కాగా.. ఈ మూవీలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం రణవీర్ సింగ్ సరసన సారా అర్జున్ హీరోయిన్‌గా నటించింది. పాకిస్తాన్ నేపథ్యంలో సాగే స్పై థ్రిల్లర్ మూవీని నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ గూఢచారి పాత్ర పోషించారు.
Tags : 1