Breaking News

బాక్సాఫీస్ వద్ద దురంధర్‌ దూకుడు.. మూడు రోజుల్లోనే సెంచరీ!

Published on Mon, 12/08/2025 - 12:17

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ దురంధర్‌. ఈ మూవీకి ఆదిత్య ధార్‌ దర్శకత్వం వహించారు. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజే దాదాపు రూ.30 కోట్లకు వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం మూడు రోజుల్లోనే సెంచరీ దాటేసింది. ఈ సినిమా ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా రూ. 103 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్‌ సాధించింది.  ఒక్క రోజే ఏకంగా రూ.43 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. గ్రాస్ పరంగా చూస్తే రూ.123.5 కోట్లు వసూలు చేసింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా దురంధర్‌ హవా కొనసాగుతోంది. మూడు రోజుల్లోనే వరల్డ్‌ వైడ్‌గా రూ.152 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే టైగర్ ష్రాఫ్  బాఘి 3 (రూ.137 కోట్లు), హృతిక్ రోషన్ విక్రమ్ వేద (రూ.135 కోట్లు), సన్నీ డియోల్ జాట్ (రూ.110 కోట్లు) చిత్రాలను అధిగమించింది. ఇదే జోరు కొనసాగితే తొలి వారంలోనే ధురంధర్ రూ.250 కోట్ దాటేలా కనిపిస్తోంది. కాగా.. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. దాదాపు రూ.140 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్  నటించారు. ఈ చిత్రం పార్ట్‌-2 మార్చి 19, 2026న విడుదల కానుంది.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)