Breaking News

ఓటీటీకి యానిమల్‌.. ఆ రోజే రిలీజ్‌?

Published on Tue, 01/23/2024 - 18:00

బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన సూపర్‌హిట్‌ మూవీ 'యానిమల్‌'. సందీప్‌ రెండ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. తండ్రీ-కుమారుల సెంటిమెంట్‌తో గతేడాదిలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రం అంతేస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. స్త్రీలను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ పలువురు ఈ చిత్రాన్ని తప్పుబట్టారు.

అయితే బాక్సాఫీస్ సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీకి రిలీజ్‌పై సస్పెన్ష్ కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని జనవరి 26న ఓటీటీలో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఊహించని విధంగా యానిమల్‌ మూవీపై వివాదం తలెత్తింది. ఓటీటీ రిలీజ్‌ను నిలిపివేయాలని కోర్టులో దావా వేసింది చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకరైన సినీ1 స్టూడియోస్‌. దీంతో రిపబ్లిక్ డే రోజున ఓటీటీ రిలీజ్‌పై సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. 

(ఇది చదవండి: చెంపదెబ్బ వల్ల చాలా గట్టిగా ఏడ్చేశాను: హీరోయిన్ రష్మిక)
 
అసలేం జరిగిందంటే.. 

కాగా.. యానిమల్‌ చిత్రాన్ని టి-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా కలిసి తెరకెక్కించాయి. ఇందులో సినీ1 స్టూడియోస్‌ 'యానిమల్‌' ఓటీటీ రిలీజ్‌ను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. యానిమల్‌ శాటిలైట్‌ హక్కుల విషయంలో సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్లూవర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలతో ఒప్పందం జరిగితే.. వారి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తనకు చెందలేదని సినీ1 స్టూడియోస్‌ ఆరోపిస్తూ కోర్టులో దావా వేసింది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థలకు కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో జనవరి 22న ఈ వివాదంపై విచారణ జరిగింది.

వివాదం తొలగినట్లే..!

ఈ అంశంపై ఈ నెల 22న ఢిల్లీ న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ విచారణకు హాజరైన సినీ1 స్టూడియోస్, టీ సిరీస్‌ సంయుక్తంగా ఓ అవగాహన ఒప్పందానికి ఓకే చెప్పినట్లు ఇరు పక్షాల తరపున సీనియర్ న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఈ ఒప్పందాన్ని కోర్టుకు సమర్పించేందుకు అంగీకరించారు. వారి మధ్య అవగాహన ఒప్పందం కుదరడంతో యానిమల్ ఓటీటీ రిలీజ్‌కు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసును మరోసారి జనవరి 24న విచారించనున్నారు. కాగా.. ఈ సినిమాను ఓటీటీలో 3 గంటల 29 నిమిషాల రన్‌టైమ్‌ ఉండనుంది. థియేటర్‌ వర్షన్‌కు అదనంగా మరో 8 నుంచి 10 నిమిషాల పాటు సీన్స్ అదనంగా చేర్చారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)