Breaking News

మద్యానికి, సిగరెట్‌కు గుడ్‌బై.. శాకాహారిగా మారిపోయిన రణ్‌బీర్‌!

Published on Fri, 09/12/2025 - 13:21

ఉన్నది ఒక్కటే జిందగీ.. నాకు నచ్చినట్లు బతికేస్తా అని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కుదరదు. ఆరోగ్యాన్ని లెక్క చేయకపోతే వెంటనే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వయసుపైబడే కొద్దీ మరింత జాగ్రత్తగా ఉండాలి. సెలబ్రిటీలైతే నోరు చంపుకుని, వ్యసనాలు వదిలించుకుని ఫిట్‌నెస్‌పై మరింత ఫోకస్‌ పెంచాల్సి ఉంటుంది. అందులోనూ ఆధ్యాత్మిక సినిమాలు చేస్తున్నప్పుడు కొందరు చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా నిష్టగా ఉంటారు. బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కూడా అదే చేశాడు.

శాఖాహారిగా మారిపోయా
ప్రస్తుతం ఇతడు దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రం రామాయణలో శ్రీరాముడిగా నటిస్తున్నాడు. సాయిపల్లవి సీతగా, యష్‌ రావణుడిగా కనిపించనున్నారు. రామాయణ (Ramayana Movie) ప్రారంభానికి ముందు రణ్‌బీర్‌ తన లైఫ్‌స్టైల్‌లో చాలా మార్పులుచేర్పులు చేసుకున్నాడు. సిగరెట్‌ తాగడం మానేశాడు, మద్యపానానికి గుడ్‌బై చెప్పాడు. పూర్తిగా శాకాహారిగా మారినట్లు తెలిపాడు. యోగా, ధ్యానం కూడా చేస్తున్నానని పేర్కొన్నాడు. రామాయణ మూవీ ప్రారంభానికల్లా చెడు అలవాట్లు శాశ్వతంగా మానేస్తానని తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. రణ్‌బీర్‌ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.

సినిమా
రామాయణ సినిమాను నితీశ్‌ తివారి డైరెక్ట్‌ చేస్తున్నాడు. దాదాపు రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో రామాయణ రెండు భాగాలుగా తెరకెక్కించనున్నామని నిర్మాత నమిత్‌ మల్హోత్రా ప్రకటించారు. ఏఆర్‌ రెహమాన్‌, హాన్స్‌ జిమ్మర్‌ సంగీతం అందించనున్నారు. ఈ మూవీలో లక్ష్మణుడిగా రవిదూబే, హనుమంతుడిగా సన్నీడియోల్‌ నటిస్తున్నారు. రామాయణ పార్ట్‌ 1.. 2026 దీపావళికి, రామాయణ పార్ట్‌ 2.. 2027 దీపావళికి రిలీజ్‌ కానున్నాయి. రామాయణ్‌తో పాటు రణ్‌బీర్‌ మరో సినిమా చేస్తున్నాడు. భార్య, హీరోయిన్‌ ఆలియా భట్‌తో కలిసి లవ్‌ అండ్‌ వార్‌ మూవీ చేస్తున్నాడు. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2026 మార్చి 20న విడుదల కానుంది.

 

 

చదవండి: నా కడుపులో తన్నాడు, ముఖంపై పిడిగుద్దులు..: బుల్లితెర నటి

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు