Breaking News

సెంచరీ కొట్టిన యానిమల్‌.. తొలిరోజు కలెక్షన్స్‌ ఎంతంటే?

Published on Sat, 12/02/2023 - 12:04

బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌, రష్మికా మందన్నా, అనిల్‌ కపూర్, బాబీ డియోల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం యానిమల్‌. ఫస్ట్‌ లుక్‌ రిలీజైనప్పటి నుంచి ఈ సినిమాకు బోలెడంత హైప్‌ వచ్చింది. టీజర్‌, ట్రైలర్‌ రిలీజయ్యాక ఆ అంచనాలు ఆకాశాన్నంటాయి. రణ్‌బీర్‌ యాక్టింగ్‌ చూసి మెంటలొచ్చేసిందని సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబే చెప్పడం విశేషం. తండ్రీకొడుకుల భావోద్వేగం చుట్టూ తిరిగే ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మూడుగంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్నప్పటికీ ఈ చిత్రానికి పాజిటివ్‌ స్పందన లభిస్తోంది. అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ వంగా దర్శకత్వం వహించిన సినిమా కావడంతో టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తాజాగా ఈ సినిమా తొలిరోజు ఎంత రాబట్టిందనే విషయాన్ని యానిమల్‌ మూవీ నిర్మాణ సంస్థ టీ సిరీస్‌ అధికారికంగా వెల్లడించింది.

మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్ల కలెక్షన్లు సాధించిందని పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే యానిమల్‌ రూ.500 కోట్ల క్లబ్బులో చేరడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి యానిమల్‌ రానున్న రోజుల్లో ఎటువంటి రికార్డులు బద్ధలు కొడుతుందో చూడాలి!

చదవండి: అందుకే నా సినిమా కలెక్షన్స్‌ తగ్గుతున్నాయి: సల్మాన్‌ ఖాన్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)