థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు
Breaking News
రూ.4,000 కోట్ల బడ్జెట్.. ఇదెలా మర్చిపోయారు? వీడియో వైరల్
Published on Fri, 04/03/2026 - 14:48
కొన్ని కథలు తెరపై ఎన్నిసార్లు చూపించినా చూడాలనిపిస్తుంది. తెలిసిన కథే అయినా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. అలాంటి ఇతిహాస కథే రామాయణం. రాముడి కథను మరోసారి సినీప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు సినిమా వస్తోంది.. అదే రామాయణ. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ కోసం దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్ కేటాయించారు.
టీజర్లో ఇది గమనించారా?
హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం (ఏప్రిల్ 2న) టీజర్ కూడా వదిలారు. ఇందులో రాముడు శివధనస్సు విరిచినప్పటినుంచి అరణ్యవాసం వరకు అనేక విషయాలకు సంబంధించిన గ్లింప్స్‌ను జత చేశారు. అయితే శ్రీరాముడు నగర వీధుల్లో నడుస్తుంటే జనం పూలతో స్వాగతం పలికే చిన్న క్లిప్‌లో ఓ పొరపాటు దొర్లింది. ఓ వ్యక్తి తలపాగా ఉన్నట్లుండి రంగు మారింది. మొదట నీలిరంగులో, తర్వాత వంకాయ కలర్లో.. ఆ తర్వాత మళ్లీ నీలిరంగులోకి మారింది.
అలా వదిలేశారేంటి?
34 సెకన్ల నుంచి 38 సెకన్ల నిడివి మధ్యలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్ మూవీలో ఈ చిన్న తప్పిదాన్ని అలాగే వదిలేశారేంటి? అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఇది వీఎఫ్ఎక్స్ సమస్య కాదని కలర్ గ్రేడింగ్ వల్ల అలా జరిగిందని, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదంటున్నారు.
సినిమా
రామాయణ విషయానికి వస్తే.. నితీశ్ తివారి దర్శకత్వం వహించిన ఈ మూవీని నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. 8సార్లు ఆస్కార్ పొందిన డీఎన్ఈజీ సంస్థ ఈ మూవీకి వీఎఫ్ఎక్స్ చేసే బాధ్యతలను చేపట్టింది. హన్మ్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
Notice the blue turban guy next to the kid his turban colour changes to purple in between shots 😳😳
₹4000 Cr Movie has new technology altogether it seems 🤩🤩#Ramayana pic.twitter.com/Bu48kWPhlq— Pan India Review (@PanIndiaReview) April 3, 2026
చదవండి: యుగానికి ఒక్కడు సీక్వెల్.. నేనైతే అస్సలు చేయను: ఆండ్రియా
Tags : 1