5 రోజులుగా దూసుకెళ్తున్న 10 కొత్త కంపెనీలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!
Breaking News
రణ్‌బీర్ కపూర్ రామాయణ.. పుష్ప-2 రికార్డ్ బ్రేక్..!
Published on Thu, 11/26/2026 - 08:45
రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా వచ్చిన మూవీ రామాయణ. దీపావళికి రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలిరోజే నుంచే వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఈ సినిమా రిలీజైన మూడు వారాల్లోనే అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ సినిమా పుష్ప-2 రికార్డ్‌ను బ్రేక్ చేసింది. కేవలం 21 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1,755.60 కోట్ల వసూళ్లను సాధించింది. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' (రూ. 1,742 కోట్లు)ను వెనక్కి నెట్టేసింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన జాబితాలో రామాయణ నాలుగోస్థానంలో నిలిచింది.
ఈ మూవీ కంటే ముందు దంగల్, దంగల్ (రూ. 2,070 కోట్లు, ధురంధర్ 2 (రూ. 1,813.40 కోట్లు), బాహుబలి -2 (రూ. 1,788 కోట్లు) చిత్రాలు ఉన్నాయి. రామాయణ నాలుగో ప్లేస్‌లో నిలవగా.. పుష్ప-2 ఐదో స్థానానికి పడిపోయింది. ఈ చిత్రంలో రావణుడిగా యశ్ నటించారు. నితీశ్ తివారి డైరెక్షన్‌లో వచ్చిన రామాయణ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండో వచ్చే ఏడాది దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
(ఇది చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో డీమాన్ పవన్, రీతూ.. ఇలా షాకిచ్చారేంటి?)
రణ్‌బీర్ కపూర్ రామాయణ ఇప్పటి వరకు ఇండియావ్యాప్తంగా రూ. 982.55 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. గ్రాస్ పరంగా చూస్తే రూ. 1,173.60 కోట్ల వసూళ్లను సాధించింది. ఓవర్‌సీస్‌లో రూ. 582 కోట్ల గ్రాస్ వసూళ్లు రావడంతో.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 1,755.60 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రంలో లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటించారు. అంతేకాకుండా కైకేయిగా లారా దత్తా, మండోదరిగా కాజల్ అగర్వాల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.
Tags : 1