కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది
Breaking News
‘నాతో పెట్టుకోవద్దు!’.. ఆటో రాంప్రసాద్ వార్నింగ్
Published on Tue, 09/08/2026 - 19:31
బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ అంటేనే కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. అయితే ఈసారి బిగ్‌బాస్10లో నామినేషన్స్ ప్రక్రియకు ముందే ఓ కంటెస్టెంట్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఇకపై తనను నామినేట్ చేసే ముందు చాలా సార్లు ఆలోచించుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు
ఊహించలేరు..
‘రేపటి నుంచి నేను ఎవరినైనా నామినేట్ చేయాలంటే మీరు ఊహించలేరు. ఇది ఒక రీజనా అని అడిగితే.. అఫ్‌కోర్స్ అని చెబుతా. మీరు చాలా తెలివైన వాళ్లని అనుకుంటున్నా. కాబట్టి జాగ్రత్తగా ఆడండి. నాతో మాత్రం పెట్టుకోవద్దు. నామినేషన్ చేసే ముందు చాలా సార్లు ఆలోచించండి’ అంటూ హెచ్చరించాడు.
ఇదీ చదవండి: చైనాలో విరిసిన ‘పౌర్ణమి’.. వీడియో వైరల్
ఒకసారి మాట్లాడుకోండి..
అంతేకాదు.. రెడ్ గ్రూప్‌లో ఉన్న ఎనిమిది మంది సభ్యులు పక్కకు వెళ్లి మాట్లాడుకోవాలని సూచించాడు. తమలో కనీసం ముగ్గురైనా తన మాట కరెక్ట్ కాదని చెబుతారని వ్యాఖ్యానించాడు. దీంతో అసలు అతడు ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నాడు? ఎవరిని నామినేట్ చేయబోతున్నాడు? అనే ఆసక్తి మొదలైంది. ఇప్పటికే టాస్కులు, టీమ్‌ల మధ్య గొడవలతో వేడెక్కిన బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వార్నింగ్ మరింత మంట రాజేసేలా కనిపిస్తోంది. నామినేషన్స్‌లో తనను టార్గెట్ చేస్తే తాను కూడా ఊహించని విధంగా స్పందిస్తానని చెప్పడంతో.. రాబోయే ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
A sweet warning from Auto. Top5 contestant?#BiggBossTelugu10 pic.twitter.com/tML4F3H640
— AnantapurBO (@AnantapurBO) September 8, 2026
Tags : 1