Breaking News

ఆంధ్ర కింగ్ తాలూకా.. మూడో రోజులైనా అంతేనా?

Published on Sun, 11/30/2025 - 16:47

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటించిన లేటేస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. అభిమానుల భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమా నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే మిక్స్‌డ్‌ టాక్ రావడంతో వసూళ్ల పరంగా నిరాశపర్చింది. తొలి రోజు కేవలం రూ.4 కోట్లకు పైగా కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.

ఇక వీకెండ్ కలిసి రావడంతో వసూళ్లు కాస్తా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ రిలీజైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.16.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మూడో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. నెట్ వసూళ్ల పరంగా చూస్తే రూ.10 కోట్ల మార్క్‌ను దాటేసింది.

అయితే మేకర్స్ అంచనాలకు తగ్గట్టుగా వసూళ్ల రాబట్టడంలో ఆంధ్ర కింగ్ సక్సెస్‌ కాలేకపోయాడు. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. కానీ మూడు రోజులైనా ఆ మార్క్ దరిదాపుల్లోకి కూడా వచ్చేలా కనిపించడం లేదు. దీంతో ఈ మూవీ వసూళ్లపై మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా కనిపించగా.. ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కించారు. 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)