Breaking News

ఏపీ హైకోర్టులో రామ్‌ గోపాల్‌వర్మ మరో పిటిషన్

Published on Thu, 11/28/2024 - 12:16

కేసుల నేపథ్యంలో ఏపీ హైకోర్టులో డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌వర్మ మరో పిటిషన్‌ దాఖలు చేశారు. తాను పెట్టిన ఒక పోస్ట్‌పై ఆంధ్రప్రదేశ్‌లో అనేక కేసులు నమోదు చేస్తున్నారని పిటిషనల్‌లో వర్మ పేర్కొన్నారు. ఒకే విషయంపై ఇన్ని కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు చేయడం చట్ట విరుద్ధమని ఆయన తెలిపారు. ఇకపై ఇదే పోస్ట్‌ విషయంలో కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని కోర్టును ఆర్జీవీ కోరారు. ఆపై ఇప్పటి వరకు తన మీద నమోదైన కేసులను కొట్టివేయాలని పిటిషనల్‌లో పేర్కొన్నారు. వర్మ దాఖలు చేసిన ఈ  క్వాష్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారించనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో తనపై నమో­దైన కేసులకు సంబంధించి తాను భయపడటం లేదని రాంగోపాల్‌వర్మ ఇప్పటికే స్పష్టం చేశారు. తన కోసం పోలీసులు గాలిస్తున్నారన్న వార్తల నేప­థ్యంలో  ఆయన ఓ  వీడియో విడు­దల చేసిన విషయం తెలిసిందే. ఏడాది క్రితం తాను చేసిన ట్వీట్లకు ఎవరి మనోభావాలో దెబ్బతిన్నా­యని ఆయన ప్రశ్నించారు. ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభా­వాలు ఎలా దెబ్బతింటాయని ఆయన అన్నారు. సంబంధంలేని వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆయన వీడియోలో పేర్కొన్నారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)