దురంధర్‌-2 మూవీకి రామ్ చరణ్ రివ్యూ.. ఏమన్నారంటే?

Published on Fri, 03/20/2026 - 19:07

రణ్‌వీర్ సింగ్‌ దురంధర్‌-2పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, రాం గోపాల్ వర్మ సీక్వెల్‌ అద్భుతంగా ఉందంటూ ట్వీట్స్ చేశారు. బాలీవుడ్ మేకర్స్ సైలెంట్‌గా ఉన్నా.. టాలీవుడ్ స్టార్స్ మాత్రం దురంధర్‌పై తమ ప్రేమను చాటుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరిపోయాడు. దురంధర్‌-2 అద్భుతంగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రణ్‌వీర్‌ సింగ్  అద్భుతమైన నటనతో మెప్పించారని.. ఈ సినిమా ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తుందని ట్విటర్‌లో రాసుకొచ్చారు.

రామ్ చరణ్ తన ట్వీట్‌లో రాస్తూ..'దురంధర్ ది రివెంజ్‌ చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఈ మూవీలో భావోద్వేగాలను అద్భుతంగా చూపించారు. ఈ చిత్రానికి ఆయన చేసిన పనిని తప్పుకుండా ప్రశంసించాల్సిందే. ఇక రణ్‌వీర్ సింగ్ అద్భుతంగా ఫర్మామెన్స్‌తో అదరగొట్టాడు. సినిమా ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తారు. మాధవన్, సంజయ్ దత్, ‍అర్జున్ రాంపాల్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. సారాఅర్జున్ తన పాత్రలో మెప్పించింది. సుస్వత్‌ మ్యూజిక్ మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ఇంత ఆసక్తకరమైన మూవీని అందించిన నిర్మాతలకు, చిత్ర బృందానికి  నా అభినందనలు.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ మార్చి 19న థియేటర్లలో రిలీజైంది. ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్‌ చివరిదశలో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.

 

 

Videos

ఆపరేషన్ ముగించే సమయం ఆసన్నమైంది.. ట్రంప్ సంచలన ప్రకటన

రోడ్లపైకి టెస్లా సెమీ ట్రక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 800 KM

పాలు పితుకుతున్నావా..? గాడిదలు కాస్తున్నావా..?

ప్లాన్ మార్చిన అమెరికా.. ట్రంప్ టార్గెట్ ఏంటంటే?

షర్మిల నీ కొడుకును అలా అన్నందుకు కొంచెం కూడా భాద అనిపించలేదా తల్లి..?

చంద్రబాబు టీటీడీ ల్యాబ్ క్రెడిట్ చోరీ

మరో సంచలన వీడియోతో అరవ శ్రీధర్ బాధితురాలు

షర్మిల భర్త అనిల్ ఆయన చెల్లెళ్ళకు సగం ఆస్తి పంచాడా...?

ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు

యుద్దానికి ముగింపు..? హంటింగ్ ఆఫ్ హార్మూజ్

Photos

+5

వాళ్లు అప్పుడు నాకు సూపర్‌స్టార్స్‌.. ఇప్పుడు నేను (ఫొటోలు)

+5

గద్దర్ అవార్డ్ వేడుక కోసం అక్కినేని కోడలు ఇలా (ఫొటోలు)

+5

మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్‌- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)

+5

శ్రీశైలంలో రమణీయంగా రథోత్సవం పులకించిన భక్తులు (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్ అందుకున్న విజేతలు (ఫొటోలు)

+5

అట్టహాసంగా గద్దర్ అవార్డుల వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

పేరేంట్స్‌గా మాకు గర్వకారణం.. కుమారుడి ఈవెంట్‌లో శివబాలాజీ దంపతులు (ఫొటోలు)

+5

టాలీవుడ్ జంట కిరణ్ అబ్బవరం- రహస్య ఉగాది వేడుకలు (ఫొటోలు)

+5

ఉగాది స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ ఇలా (ఫొటోలు)