మాస్‌ యాక్షన్ షురూ

Published on Sat, 03/15/2025 - 00:03

రామ్‌చరణ్‌(Ram Charan) హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్పోర్ట్స్‌ డ్రామా ఫిల్మ్‌ ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌). ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతిబాబు, కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, బాలీవుడ్‌ నటుడు దివ్యేందు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఓ సెట్‌లో నైట్‌ షూట్‌ జరుగుతోందని తెలిసింది. రామ్‌చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్‌ల కాంబినేషన్ లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అలాగే ఈ సినిమాలో క్రికెట్, కుస్తీ గురించే కాకుండా... మరికొన్ని ఇతర స్పోర్ట్స్‌ గురించిన ప్రస్తావన కూడా ఉంటుందని తెలిసింది. 

ఇంకా ఈ షెడ్యూల్‌లోనే ఓ మాస్‌ యాక్షన్  సీక్వెన్స్‌ను తీసేందుకు టీమ్‌ రెడీ అయిందని, ‘జైలర్‌’ ఫేమ్‌ కెవిన్  కుమార్‌ ఈ యాక్షన్  సీక్వెన్స్ కు కొరియోగ్రఫీ చేయనున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. సుకుమార్‌ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సమర్పణలో వద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్‌ రెహమాన్ .

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)