Breaking News

ఉపాసన కాళ్లు నొక్కిన రామ్‌చరణ్‌.. వీడియో వైరల్‌

Published on Sat, 03/02/2024 - 11:14

ప్రముఖ బిజినెస్‌మెన్‌ ముఖేశ్‌ అంబానీ తనయుడు అనంత్‌ అంబానీ పెళ్లికి ఇంకా నాలుగు నెలల సమయముంది. కానీ అప్పుడే పెళ్లి వేడుకలు మొదలుపెట్టేశారు. ఏదో ఆషామాషీగా కాకుండా దేశవిదేశాల నుంచి ప్రముఖులకు ఆహ్వానం పంపించారు. ఆల్‌రెడీ మొదలైన ఈ ప్రీవెడ్డింగ్‌ కార్యక్రమాలకు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌, మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ బిల్‌గేట్స్‌, పాప్‌ సింగర్‌ రిహాన్నా సహా అనేకమంది అంతర్జాతీయ సెలబ్రిటీలు హాజరయ్యారు.

కునుకు తీసిన భార్య..
బాలీవుడ్‌ తారలు సైతం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోనే తిష్ట వేశారు. ఈ ప్రీవెడ్డింగ్‌ కార్యక్రమాల కోసం టాలీవుడ్‌ నుంచి రామ్‌చరణ్‌ దంపతులకు ఆహ్వానం అందింది. దీంతో శుక్రవారం ప్రత్యేక విమానంలో వీరు జామ్‌నగర్‌కు వెళ్లారు. విమానంలో ఉపాసన కునుకు తీస్తుండగా చరణ్‌ ఆమె కాళ్లు నొక్కుతూ కనిపించాడు. అక్కడే ఉన్నవాళ్లు దీన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేయగా క్షణాల్లో అది వైరల్‌గా మారింది.

అవార్డు ఇచ్చేయాల్సిందే!
ఇది చూసిన జనాలు ఇంక ఆలస్యం చేయొద్దు, చరణ్‌కు బెస్ట్‌ హజ్బెండ్‌ అవార్డు ఇచ్చేయండి అని కామెంట్లు చేస్తున్నారు. భార్యకు సేవ చేయడం చరణ్‌కు కొత్తేమీ కాదు. ఇంటి పనుల్లో సాయం చేయడం దగ్గరి నుంచి షాపింగ్‌కు వెళ్తే బ్యాగులు మోయడం వరకు అన్నీ చేస్తుంటాడు. ఇద్దరూ సమానమే అన్న విషయాన్ని తు.చ తప్పకుండా పాటిస్తాడు. ఎంత పెద్ద హీరో అయినా కించిత్తు గర్వం లేకుండా భార్యకు సేవ చేస్తున్న చరణ్‌ను పురుషులంతా ఆదర్శంగా తీసుకోవాలంటున్నారు మహిళామణులు.

చదవండి: ప్రశాంత్‌ నీల్‌ ఇంట్లో జూ ఎన్టీఆర్‌, రిషబ్‌ శెట్టి.. కారణం ఇదే

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)