మైసూర్‌లో రామ్‌చరణ్‌,జాన్వీకపూర్‌ ప్రయాణం

Published on Mon, 11/04/2024 - 00:55

హీరో రామ్‌చరణ్‌ ఓ వైపు శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ అనే పాన్‌ ఇండియా మూవీ చేస్తున్నారు. మరోవైపు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్‌సీ 16’(వర్కింగ్‌ టైటిల్‌) చిత్రం షూటింగ్‌లో పాల్గొనేందుకు ఈ నెలలో మైసూర్‌ వెళ్లనున్నారాయన. తొలి చిత్రం ‘ఉప్పెన’ తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న బుచ్చిబాబు సానా ద్వితీయ చిత్రాన్ని రామ్‌చరణ్‌తో చేసే అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు ‘ఆర్‌సీ 16’ ని పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఈ మూవీలో జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్‌ హీరోల్లో ఒకరైన శివ రాజ్‌కుమార్‌ పవర్‌ఫుల్‌ రోల్‌ పోషించనున్నారు. కాగా ఈ సినిమా తొలి షెడ్యూల్‌ ఈ నెల 22 నుంచి కర్నాటక రాష్ట్రంలోని మైసూర్‌లో మొదలవుతుందని సమాచారం. రామ్‌ చరణ్‌తో పాటు ముఖ్య తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించనున్నారట బుచ్చిబాబు. అక్కడ నాన్‌స్టాప్‌గా 15 రోజుల పాటు షూటింగ్‌ జరుపుతారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)