బ్లాక్‌బస్టర్ సక్సెస్.. 'ధురంధర్' నటుడికి కోటి రూపాయల గిఫ్ట్

Published on Fri, 04/24/2026 - 12:20

గత నెలలో రిలీజైన 'ధురంధర్ 2' సినిమా ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డులని బద్దలు కొట్టేసింది. ఇంకా థియేటర్లలో ఆడుతూనే ఉంది. ఈ మూవీ గురించి మెల్లగా అందరూ మర్చిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇందులో నటించిన రాకేశ్ బేడీ.. నిర్మాతల నుంచి రూ.కోటి గిఫ్ట్ అందుకోవడమే దీనికి కారణం. ఇంతకీ ఏంటి విషయం?

(ఇదీ చదవండి: ‘రాకా’ నుంచి తప్పుకున్న దీపికా పదుకొణె.. టీమ్‌ క్లారిటీ)

'ధురంధర్' మొదటి భాగంలో అక్షయ్ ఖన్నా తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకోగా.. గత నెలలో రిలీజైన రెండో భాగంలో హీరో రణ్‌వీర్ సింగ్ ఫెర్ఫార్మెన్స్ అదరగొట్టేశాడు. అయితే చివరలో రాకేశ్ బేడీ చేసిన జమీల్ జమాలీ పాత్రతో ఇచ్చిన ట్విస్ట్ అయితే ప్రతి ఒక్కరూ అవాక్కయ్యేలా చేసింది. అప్పటివరకు పాక్ రాజకీయ నాయకుడి పాత్రనే అని అంతా అనుకున్నారు. కానీ ఇతడు కూడా భారతదేశ్ గూఢచారి అనేది సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. హీరో, విలన్ తదితరులని ఎంతలా మెచ్చుకున్నారో.. రాకేశ్ బేడీకి కూడా అంతకంటే ఎక్కువ ప్రశంసలు దక్కాయి.

రెండు భాగాల్లోనూ అద్భుతంగా నటించి మెప్పించిన రాకేశ్ బేడీకి రూ.50 లక్షల రెమ్యునరేషన్ అని ముందే మాట్లాడుకున్నారు. అది చెల్లించేశారు కూడా. కానీ ఇప్పుడు సినిమా ఘనవిజయం సాధించడంతో దర్శకనిర్మాత ఆదిత్యధర్.. ఈయనకు అదనంగా రూ.కోటి రూపాయల చెక్ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. 'ధురంధర్ 2' కలెక్షన్స్ ప్రస్తుతం రూ.1800 కోట్లకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: నా ఓటు టీవీకే పార్టీకే వేశా.. విజయ్‌ సీఎం అవుతాడు)

Videos

మా డాడీని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం..

ఏకంగా 93% పోలింగ్.. రికార్డు సృష్టించిన బెంగాల్ ఓటర్లు..

సిలబస్ లో లేని ప్రశ్నలు.. లోకేష్ మళ్లీ అదే తప్పు

జనసేన మహిళపై.. పచ్చి బూతులతో TDP నేతల దాడి

హార్ముజ్ లో రణరంగం.. లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

మీకు గొడవలే కావాలనుకుంటే నేను రెడీ.. జక్కంపూడి మాస్ వార్నింగ్

మీకు సిగ్గనిపించడం లేదా? పోలీసులకు హైకోర్టు చీవాట్లు

RTC విలీనానికి ఓకే.. 11% పీఆర్సీకి గ్రీన్ సిగ్నల్

ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు సఫలం.. సమ్మె విరమణ

చేతికి మట్టి అంటకుండా.. మటాష్.. పెద్ద దస్తగిరి హత్యలో భారీ కుట్ర!

Photos

+5

హైదరాబాద్ : బంగారు కాంతుల్లో అందాల కాంత! (ఫొటోలు)

+5

భార్యతో కలిసి ప్రియదర్శి హిమాలయ ట్రిప్ (ఫొటోలు)

+5

తండ్రికి శ్రీముఖి బర్త్ డే విషెస్ (ఫొటోలు)

+5

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. డిపోలకే పరిమితమైన బస్సులు (ఫొటోలు)

+5

సతీమణితో శ్రీవారిని సేవలో డైరెక్టర్ బాబీ (ఫొటోలు)

+5

రెడ్ డ్రస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ (ఫొటోలు)

+5

క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండుల్కర్‌ బర్త్‌డే.. ఈ ఫొటోలు చూశారా?

+5

హైదరాబాద్‌లో కొత్త పార్క్.. ఈ వేసవి సెలవుల్లో ఓ లుక్కేయండి (ఫొటోలు)

+5

గ్లామర్‌ క్వీన్‌ కేతిక శర్మ స్టన్నింగ్ లుక్స్‌ (ఫోటోలు)

+5

ప్రముఖ ఎగ్జిబిషన్‌లో టాలీవుడ్ యాంకర్‌ లాస్య సందడి (ఫోటోలు)