Breaking News

రాజుగారి నాలుగో గది.. హిట్ కాంబో మరోసారి

Published on Thu, 10/02/2025 - 12:10

దసరా సందర్భంగా కొత్త సినిమాల అప్‌డేట్స్ వస్తుంటాయి. ఈసారి కూడా అలానే పలు చిత్రాలవి వచ్చేశాయి. వీటిలో హారర్ ఫ్రాంచైజీ అయిన రాజుగారి గది నాలుగో భాగం ఒకటి కాగా.. సామజవరగమన కాంబో మళ్లీ రిపీట్ అయింది. ఈ క్రమంలోనే పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. షూటింగ్ అప్‌డేట్ కూడా ఇచ్చేశారు.

(ఇదీ చదవండి: నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి నిశ్చితార్థం)

యాంకర్ ఓంకార్ దర్శకుడిగా మారిన తర్వాత 'రాజుగారి గది' సినిమాలతో ఫేమస్ అయ్యాడు. అయితే తొలి పార్ట్ సూపర్ హిట్ అయింది. రెండు, మూడో పార్ట్స్ మాత్రం యావరేజ్ అనిపించుకున్నాయి. మూడో భాగం 2019లో రాగా దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు నాలుగో భాగాన్ని అనౌన్స్ చేశారు. ఓంకార్ దర్శకత్వం వహిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది. త్వరలో షూటింగ్ కూడా మొదలు కానుందని చెప్పుకొచ్చారు. ఈసారి కాళికా దేవి బ్యాక్ డ్రాప్ స్టోరీతో మూవీ తీయబోతున్నట్లు పోస్టర్స్ చూస్తుంటే అర్థమవుతోంది.

2023లో అంచనాల్లేకుండా వచ్చి హిట్ అయిన సినిమా 'సామజవరగమన'. శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకుడు. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో కొత్త సినిమాను ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దసరా సందర్భంగా లాంఛనంగా పూజతో ప్రాజెక్టుని ప్రారంభించారు. అయితే ఇది 'సామజవరగమన' సీక్వెలా లేదంటే కొత్త స్టోరీతో తీస్తున్నారా అనేది కొన్నిరోజులు ఆగితే క్లారిటీ రావొచ్చు.

(ఇదీ చదవండి: 'కాంతార ఛాప్టర్ 1' సినిమా రివ్యూ)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)