Breaking News

‘ది రాజాసాబ్‌’ నుంచి ఆ రెండు సీన్లు కట్‌.. రన్‌టైమ్‌ ఎంతంటే?

Published on Tue, 01/06/2026 - 17:27

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన తొలి హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ ‘ది రాజాసాబ్‌’.  మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళ‌విక మోహ‌న‌న్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. విలన్‌ పాత్రలో సంజయ్‌దత్‌ కనిపించబోతున్నాడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

(చదవండి: దిలీప్ కుమార్.. ఏఆర్ రెహమాన్‌‌గా ఎలా మారాడు?)

ఫ్యాన్స్‌ కోసం ఒకరోజు ముందే..అనగా జనవరి 8న సాయంత్రమే ప్రీమియర్స్‌ వేయబోతున్నారు. ఇటీవల ఈ మూవీ సెన్సార్‌ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ రన్‌ టైమ్‌ బయటకు వచ్చింది. ఈ సినిమా రన్‌టైమ్‌ 189 నిమిషాలు. అంటే 3 గంటల 9 నిమిషాల నిడివితో ప్రేక్షకులను అలరించబోతుంది. 

ఇక ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్‌ ఇచ్చిన సెన్సార్‌ సభ్యులు.. సినిమా మొత్తంలో రెండు కట్స్‌ మాత్రమే చెప్పారట. సినిమాలో తల నరికే సీన్‌తో పాటు నేలపై ఎక్కువ రక్తం కనిపించే సన్నివేశాన్ని తొలగించాలని సూచించారు. దీంతో ఆ రెండు సీన్స్‌ సినిమాలో నుంచి తొలగించిన 189 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట.  

(చదవండి: ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ సీక్వెల్‌పై క్లారిటీ!)

బాహుబలి తర్వాత పాన్‌ ఇండియా సినిమాలన్నీ దాదాపు మూడు గంటల నిడివితోనే రిలీజ్‌ అవుతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్‌ నుంచి వచ్చిన చిత్రాలన్నీ దాదాపు ఎక్కువ రన్‌టైమ్‌నే కలిగి ఉన్నాయి. ఇప్పుడు ది రాజాసాబ్‌(The Raja Saab ) కూడా అత్యధిక నిడివితో విడుదల కాబోతుంది.  హారర్‌ కామెడీతో ప్రేక్షకులను మూడు గంటలు కూర్చోబెట్టడం కాస్త రిస్కే.  ఏమాత్రం తేడా వచ్చిన ఫలితం తారుమారు అవుతుంది. ‘రాజాసాబ్‌’ మాత్రం రిస్క్‌ చేసి మరీ పెద్ద నిడివితో వస్తున్నాడు.  ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. 


 

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?