అత్తారింట్లోకి సామ్‌.. రాజ్‌ సోదరి ఎమోషనల్‌ పోస్ట్‌

Published on Wed, 12/03/2025 - 09:40

హీరోయిన్‌ సమంత- దర్శకుడు రాజ్‌ నిడిమోరు సోమవారం (డిసెంబర్‌ 1న) రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు కోయంబత్తూరులోని ఇషా ఆశ్రమం వేదికగా నిలిచింది. గత కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట తమ ప్రేమ విషయం గురించి ఎన్నడూ పెదవి విప్పి మాట్లాడలేదు. ఇప్పుడేకంగా పెళ్లి చేసుకుని అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశారు.

ఆనంద భాష్పాలు
ఈ క్రమంలో సమంత.. తన భర్త కుటుంబంతో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఈ ఫోటోను రాజ్‌ సోదరి శీతల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ భావోద్వేగానికి లోనైంది. ప్రదోషకాలంలో శివుడిని పూజిస్తుంటే నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి. అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కావు, ఆనంద భాష్పాలు. నేడు మా కుటుంబం పరిపూర్ణమైంది. సమంత-రాజ్‌ కలిసికట్టుగా ముందుకు సాగడం చూస్తుంటే మాకెంతో గర్వంగా ఉంది. 

మా ఆశీర్వాదం..
మా కుటుంబం అన్నివేళలా వారికి అండగా, తోడుగా నిలబడుతుంది. మా అందరి ఆశీర్వాదాలు వారికి ఎల్లప్పుడూ ఉంటాయి. అందులో ఎటువంటి సందేహమూ లేదు. కొన్ని బంధాలు మన జీవితాల్లోకి ఎంతో ప్రశాంతతను తీసుకొస్తాయి. ఇది కూడా అలాంటిదే! ప్రతి ఒక్కరూ ఇలాంటి స్వచ్ఛమైన, శాంతియుత ప్రేమను పొందాలని కోరుకుంటున్నాను అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు సమంత (Samantha Ruth Prabhu) స్పందిస్తూ లవ్‌ యూ అని కామెంట్‌ చేసింది.

 

 

చదవండి: నాతో పనిచేసినోళ్లంతా పెద్ద హీరోలయ్యారు.. నేనే సక్సెస్‌ లేక..

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)