Breaking News

టీవీకే పార్టీలోకి మరో హీరో? పోస్టుతో క్లారిటీ

Published on Sun, 06/07/2026 - 11:42

తమిళనాడు రాజకీయాల్లో సినీ గ్లామర్ కాస్త ఎక్కువనే చెప్పొచ్చు. రీసెంట్ ఎన్నికల్లో టీవీకే పార్టీ గెలవగా, హీరో విజయ్ ఏకంగా ముఖ్యమంత్రి కూడా అయిపోయారు. ప్రస్తుతం ఆయన తనదైన పాలనతో బిజీగా ఉన్నారు. మరోవైపు టీవీకే పార్టీలోకి ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో లారెన్స్ రాబోతున్నారనే ప్రచారం రెండు మూడు రోజుల నుంచి సాగుతోంది. ఈ రూమర్స్‌కి ఎండ్ కార్డ్ వేసిన ఇతడు.. పరోక్షంగా ఓ క్లారిటీ ఇచ్చేశాడు.

(ఇదీ చదవండి: సీఎం విజయ్ అలా చేయడం కరెక్ట్ కాదు)

ఈ మధ్యే జరిగిన తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్.. పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. రెండు చోట్ల విజయం సాధించారు. రాజ్యంగం ప్రకారం ఒకచోట రాజీనామా చేయాలి. దీంతో తిరుచ్చి సీటుకు రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ త్రిషని నిలబెడతారనే కొన్నిరోజుల క్రితం రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి. అయితే అలాంటిదేం లేదని ‍‍దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడా స్థానంలోనే లారెన్స్.. టీవీకే తరఫున పోటీ చేయనున్నారని వార్తలొస్తున్నాయి.

తాజాగా ఈ పుకార్లపై స్పందించిన లారెన్స్.. అందరికి నమస్కారం. తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికల్లో నేను పోటీ చేస్తానని పలు మీడియా ఫ్లాట్‌ఫామ్స్ వార్తలొస్తున్నాయి.  తెలిసిన మీడియా మిత్రులు కూడా నాకు ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వాలని అడిగారు. పుకార్లు ఎక్కువవుతుండటం వల్ల నేను స్పష్టం చేయాలనుకుని ఈ నోట్ షేర్ చేస్తున్నాను. ప్రస్తుతం 'బెంజ్' షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. ఈనెల 10వ తేదీకి షెడ్యూల్ పూర్తవుతుంది. 11వ తేదీ ఉదయం 9:30 గంటలకు మా అమ్మ ఆశీర్వాదంతో ముఖ్యమైన విషయాన్ని పంచుకుంటాను అని రాసుకొచ్చాడు.

అమ్మ ఆశీర్వాదంతో చెబుతానని లారెన్స్ అంటున్నాడంటే తిరుచ్చి ఉపఎన్నికల్లో టీవీకే తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడం నిజమే అనే సందేహాలు కలుగుతున్నాయి. నటుడు, కొరియోగ్రాఫర్ అయినప్పటికీ చాన్నాళ్లుగా లారెన్స్ పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యమంత్రి విజయ్ గతంలో చేసిన సినిమాలోని పాటలకు ఇతడు కొరియోగ్రఫీ చేశాడు. బహుశా ఆ బాండింగ్ వల్లే విజయ్, తను ఖాళీ చేసిన స్థానంలో లారెన్స్‌కి అవకాశం ఇవ్వబోతున్నాడా అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: 30 ఏళ్ల నాటి కేసు.. నటి సుకన్యకు రూ.10 లక్షల నష్టపరిహారం)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)