Breaking News

రూ.60 కోట్ల దావా.. ఓటీటీ రిలీజ్ పై హైకోర్ట్ జోక్యం

Published on Sun, 05/11/2025 - 14:09

ఇ‍ప్పుడంతా ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. థియేటర్లలో రిలీజైన చాలా సినిమాలు.. తక్కువ రోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. మరికొన్ని నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. కానీ రీసెంట్ గా 'భోల్ చుక్ మాఫ్' అనే హిందీ చిత్రం మాత్రం విడుదలకు మరోరోజు ఉందనగా.. ఓటీటీలోకి వచ్చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టుకెక్కింది.

లెక్క ప్రకారం 'భోల్ చుక్ మాఫ్' సినిమా మే 09న థియేటర్లలో రిలీజ్ అవ్వాలి. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ చేశారు. థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ చేశారు. చాలామంది టికెట్స్ కూడా కొనుకున్నారు. కానీ రిలీజ్ కి ఒకరోజు ముందు నిర్మాతలు అందరికీ షాకిచ్చారు. మే 16 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మూవీ స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు.

(ఇదీ చదవండి: ఒక్క ఫ్రేమ్ లో 19 మంది తెలుగు యంగ్ డైరెక్టర్స్.. ఏంటి విశేషం?) 

దీంతో ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్.. బాంబే హైకోర్టుని ఆశ్రయించింది. ఈ సినిమా కోసం తాము చాలా ఖర్చు చేశామని, ఇప్పుడు ఇలా ఓటీటీలో రిలీజ్ చేయడం సరికాదని రూ.60 కోట్ల దావా వేసింది. కట్ చేస్తే ఇప్పుడు ఓటీటీ రిలీజ్ పై హైకోర్ట్ స్టే ఇచ్చింది. అంటే తదుపరి ఆర్డర్ వచ్చేంతవరకు మూవీని ఎక్కడా విడుదల చేయడానికి వీల్లేదనమాట. 

రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలో భారత క్రికెటర్ చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ ఐటమ్ సాంగ్ చేయడం విశేషం. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఈ వ్యవహారంలో తర్వాత ఏం జరుగుతుందో చూడాలి?

(ఇదీ చదవండి: దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ) 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)