Breaking News

గ్రాండ్‌గా నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి పెళ్లి

Published on Sun, 11/23/2025 - 15:52

ఎన్నో తెలుగు సినిమాలు తీసిన నిర్మాత అశ్వనీదత్ ఇంట్లో పెళ్లి సందడి. ఈయన మూడో కూతురు స్రవంతి, విక్రమ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. హైదరాబాద్‌లో  శనివారం రాత్రి ఈ శుభకార్యం జరిగింది. నాగార్జునతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరుల్ని దీవించారు. హడావుడి లేకపోవడంతో వివాహానికి సంబంధించిన ఫొటోలు పెద్దగా బయటకు రాలేదు.

(ఇదీ చదవండి: తెలిసిన విషయాలే కానీ మనసుని మెలిపెట్టేలా.. ఓటీటీ రివ్యూ)

అక్టోబరు 1వ తేదీన స్రవంతి-విక్రమ్ నిశ్చితార్థం జరగ్గా.. తర్వాత రోజు ఈమె సోదరి స్వప్న తన సోషల్ మీడియాలో ఎంగేజ్‌మెంట్ ఫొటోల్ని పోస్ట్ చేసింది. ఇప్పుడు అలానే పెళ్లి ఫొటోలని పోస్ట్ చేస్తారేమో చూడాలి? వైజయంతి మూవీస్ తరఫున చాన్నాళ్లుగా అశ్వనీదత్ మూవీస్ తీస్తూ వచ్చారు. కొన్నేళ్ల క్రితం పూర్తిగా తగ్గించేశారు. ఈయన కూమార్తెలు స్వప్న, ప్రియాంక.. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఎవడే సుబ్రమణ్యం, మహానటి, సీతారామం తదితర సినిమాలు తీసి సక్సెస్ అందుకున్నారు. గతేడాది ప్రభాస్‌తో 'కల్కి' తీసి పాన్ ఇండియా హిట్ కొట్టారు.

అశ్వనీదత్ ఇద్దరు కుమార్తెలు స్నప్న, ప్రియాంకతో పాటు అల్లుడు నాగ్ అశ్విన్.. ఇండస్ట్రీలోనే ఉన్నారు. కానీ ఈయన మూడో కూతురు స్రవంతికి మాత్రం సినీ పరిశ్రమతో సంబంధం లేదు. అందుకే పెళ్లి హడావుడి ఎక్కడా కనిపించలేదు.

(ఇదీ చదవండి: ప్రకటించిన నాలుగేళ్లకు ప్రభాస్ 'స్పిరిట్' లాంచ్)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌