Breaking News

'భోళా శంకర్' ఫ్లాప్.. సోషల్ మీడియానే కారణం

Published on Wed, 01/07/2026 - 17:54

చిరంజీవి లేటెస్ట్ సినిమా 'మన శంకరవరప్రసాద్ గారు'.. సంక్రాంతి కానుకగా ఈనెల 12వ తేదీన అంటే సోమవారం నుంచి థియేటర్లలోకి రానుంది. అయితే ఈయన గత చిత్రం 'భోళా శంకర్'.. దాదాపు రెండున్నరేళ్ల క్రితం రిలీజైంది. ఇది చిరు కెరీర్‍‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. తాజాగా ఈ మూవీ గురించి నిర్మాత అనిల్ సుంకర మాట్లాడారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వల్లే సినిమా ఫ్లాప్ అయిందన్నట్లు చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: ‘రాజాసాబ్‌’కు రూ.1000 కోట్లు సాధ్యమేనా?)

'భోళా శంకర్ విషయంలో నేను బాగా హర్ట్ అయ్యింది ఏంటంటే.. సోషల్ మీడియాలో కొందరు డెకాయిట్లు ఉంటారు కొందరు. వీళ్లు ఏంటంటే టైమ్ చూసి దెబ్బ కొట్టారు. ముందే మీమ్స్ తయారు చేసుకున్నారు. ఈ విషయం నాకు తర్వాత తెలిసింది. చేసినోడే నాకు ఇదంతా చెప్పాడు. చివరకు ఏమైంది ఎవరి కర్మ వాళ్లే అనుభవిస్తున్నారు' అని అనిల్ సుంకర అన్నారు.

ఫ్లాప్ అవ్వడానికి ఇతర కారణాలు కూడా చెబుతూ.. 'మొదటగా అది రీమేక్. కొవిడ్ కంటే ముందే మొదలుపెట్టాం. కానీ కొవిడ్ టైంలో ఒరిజినల్ సినిమాని అందరూ చూసేశారు. ఏదైతే బిగ్గెస్ట్ పాయింట్ అనుకున్నామో అది రిలీజ్ టైంకి వచ్చేసరికి మైనస్ అయింది. మాకు బ్యాడ్ లక్ ఏంటంటే చిరంజీవి ఒకేసారి మూడు మూవీస్ మొదలుపెట్టారు. వాటిలో మాది చివరగా రిలీజైంది. లాస్ట్ అయ్యేసరికి ఈలోపు ఒరిజినల్ అందరూ చూసేశారు. ఆ ప్రభావం కూడా ఫలితంపై పడింది. అలానే విడుదలకు ముందే ఫ్లాప్ అనేది ముందే క్రియేట్ చేశారు' అని అనిల్ సుంకర చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ రిలీజ్)

'భోళా శంకర్' విషయానికొస్తే.. తమిళంలో అజిత్ చేసిన 'వేదాళం' రీమేక్‌గా దీన్ని తీశారు. చిరంజీవి హీరోగా, చెల్లి పాత్రలో కీర్తి సురేశ్ నటించింది. మెహర్ రమేశ్ దర్శకుడు. తమన్నా హీరోయిన్. అయితే తొలిరోజు తొలి ఆటకే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. రెండో రోజు నుంచి థియేటర్లలో జనాలు కనిపించలేదు.

ఇకపోతే అనిల్ సుంకర్ నిర్మించిన లేటెస్ట్ మూవీ 'నారీ నారీ నడుమ మురారి'. శర్వానంద్ హీరోగా నటించగా సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లు. 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకుడు. జనవరి 14న ప్రీమియర్లతో ఇది థియేటర్లలోకి వస్తోంది. దీని ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనే 'భోళా శంకర్' ఫ్లాప్ గురించి అనిల్ సుంకర స్పందించారు. 

(ఇదీ చదవండి: హైకోర్టులో చిరు, ప్రభాస్‌ నిర్మాతలకు ఊరట)

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)