Breaking News

ప్రియాంక చోప్రాకు అరుదైన గౌరవం.. ప్రపంచస్థాయి అవార్డ్‌కు ఎంపిక

Published on Tue, 04/22/2025 - 15:45

బాలీవుడ్ హీరోయిన ‍ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ29 సినిమాలో కనిపించనుంది. రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న తొలి చిత్రంలో ఈ ముద్దుగుమ్మ కీలక పాత్ర పోషించనుంది. ఇటీవలే ఒడిశాలో జరిగిన షూటింగ్‌ షెడ్యూల్‌ కూడా పూర్తి చేసుకుంది.  దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

అయితే తాజాగా ప్రియాంక చోప్రాకు అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రముఖ గోల్డ్ హౌస్ గాలా సంస్థ అందించే గ్లోబల్ వాన్‌గార్డ్ హానర్ అవార్డ్‌కు ఎంపికైంది. ఈ బాలీవుడ్ స్టార్‌తో పాటు హాలీవుడ్ రాపర్ మేగాన్ థీ స్టాలియన్, అకాడమీ అవార్డు దర్శకుడు ఆంగ్ లీ,  చిత్రనిర్మాత జాన్ ఎంచు కూడా ఈ అవార్డ్‌కు ఎంపికయ్యారు. ఈ అవార్డ్‌ను ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన లీడర్లకు అందించనున్నారు. ఈ అవార్డ్‌ను మే 10న  లాస్ ఏంజిల్స్‌లోని మ్యూజిక్ సెంటర్‌లో జరిగే గోల్డ్ హౌస్ గాలా నాల్గవ వార్షిక సమావేశంలో ప్రియాంక చోప్రాను సత్కరించనున్నారు.

గోల్డ్ హౌస్ గాలా- ఏ100 జాబితాను వెల్లడించనుంది. సంస్కృతి, వ్యాపారంలో అత్యంత ప్రభావవంతమైన 100 ఆసియా పసిఫిక్ లీజర్లను ప్రతి ఏటా ఎంపిక చేస్తారు. ఈ సంవత్సరం ఏ100 జాబితా మే 1న వెల్లడించనున్నాురు. ఈ వేడుకకు ముందు సినిమా, సాంకేతికత, మీడియాతో సహా వివిధ పరిశ్రమలకు చెందిన 600 మందికి పైగా అతిథులను ఆహ్వనించనున్నారు.

కాగా.. 2000లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత హిందీ సినిమాలో దాదాపు 25 ఏళ్ల తన కెరీర్‌లో రాణించింది. ఆ తర్వాత ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోనూ నటించింది. ప్రస్తుతం ఆమె ఆమె జాన్ సెనా, ఇద్రిస్ ఎల్బాతో కలిసి హాలీవుడ్ చిత్రం 'హెడ్స్ ఆఫ్ స్టేట్'లో కూడా కనిపించనుంది.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)