Breaking News

ఓటీటీకి ప్రియదర్శి రొమాంటిక్ కామెడీ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published on Sun, 12/14/2025 - 10:36

ప్రియదర్శి పులికొండ, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ప్రేమంటే. ఈ మూవీలో సుమ కనకాల ముఖ్యపాత్రలో నటించారు. నవనీత్‌ శ్రీరామ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కంచారు. రానా స్పిరిట్‌ మీడియా సమర్పణలో పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, జాన్వీ నారంగ్‌ నిర్మించారు. నవంబర్ 21న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. నెల రోజుల్లోపే డిజిటల్‌ స్ట్రీమింగ్ కానుంది.  ఈ నెల 19 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ప్రేమంటే కథేంటంటే..

మధుసూధన్(ప్రియదర్శి) అనే కుర్రాడు.. రమ్య (ఆనంది) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని విషయాలు తెలిసినా సరే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతాడు. అలాంటి మధుసూదన్ జీవితంలో పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే స్టోరీ.

 

Videos

150 కార్లతో కోటి సంతకాల ర్యాలీ దద్దరిల్లిన చిత్తూరు

Rajahmundry: 5000 బైకులతో YSRCP భారీ ర్యాలీ

One Crore Signatures: ఈ జనసంద్రాన్ని చూసి బాబు ఏమైపోతాడో పాపం!

మరో రెండేళ్లు ఓపిక పడితే వచ్చేది మన ప్రభుత్వమే: కేటీఆర్

YV: ఏపీ ఎన్నికల అక్రమాలపై రాజ్యసభలో దుమ్ములేపిన MP వైవీ సుబ్బారెడ్డి

Gold Rate: భారతదేశంలో ఈ రోజు బంగారం, వెండి ధరలో భారీ పెరుగుదల

బోండీ బీచ్ లో కాల్పుల ఘటనపై ముమ్మర దర్యాప్తు

సోనియా.. రాహుల్ మోదీకి క్షమాపణ చెప్పండి బీజేపీ నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్

MLC KRJ Bharath: జ‌గ‌న్‌ను సీఎం చేసే వరకూ ఈ ఉద్యమం ఆగదు

అమరజీవి పొట్టి శ్రీరాములుకు వైఎస్ జగన్ నివాళి

Photos

+5

సీమంతం ఫోటోలు షేర్ చేసిన బిగ్‌బాస్‌ బ్యూటీ, యాంకర్ శివజ్యోతి.. ఫోటోలు

+5

మరాఠీ స్టైల్లో మృణాల్ ఠాకుర్.. చీరలో నిండుగా (ఫొటోలు)

+5

సిద్దిపేట : కమనీయం కొమురవెల్లి మల్లన్న కల్యాణం (ఫొటోలు)

+5

లగ్జరీ ఇంటీరియర్‌ డిజైనర్‌ స్టూడియోలో నాగచైతన్య (ఫొటోలు)

+5

వైఎస్సార్‌సీపీ పోరుబాట.. ‘కోటి సంతకాల’ ప్రతులతో భారీ ర్యాలీ (ఫొటోలు)

+5

మినీ ఎక్స్ ఎస్క్వైర్ ఇండియా ఈవెంట్ లో మెరిసిన తారలు (ఫొటోలు)

+5

విశాఖపట్నం : కనువిందు చేస్తున్న విదేశీ వలస పక్షులు (ఫొటోలు)

+5

దిల్‌ రాజు కూతరు మేకప్ స్టూడియో.. చీఫ్‌ గెస్ట్‌గా అల్లు స్నేహారెడ్డి (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ..జోరుగా దీక్షల విరమణ (ఫొటోలు)

+5

‘అఖండ 2: తాండవం’ సినిమా సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)