Breaking News

పబ్‌లో అల్లరి... నటిపై కేసు.. అనుకున్నదే జరిగిందిగా!

Published on Thu, 06/12/2025 - 19:32

గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం అనేది ఒకప్పుడు అవివేకంతో జరిగేది.. ఇప్పుడు అతి తెలివితో జరుగుతోంది. ఆ అతి తెలివి ఎలాంటిది అంటే... వైరంతోనే వైరల్‌ అవుతామనే అపోహ కల్పిస్తుంది. అందుకే ఇటీవలి కాలంలో అనవసర వివాదాలతో అవాంఛనీయ ప్రచారాన్ని తెచ్చుకుంటున్న సెలబ్రిటీలు ఎందరో కనిపిస్తున్నారు. అలాంటి వారిని చూసినప్పుడు చుట్టాలున్నారు జాగ్రత్త అనేది సినిమా తీశారు గానీ చట్టాలున్నాయి జాగ్రత్త అనే సినిమా కూడా ఎవరైనా తీసి వీళ్లకి చూపించి ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది.

ట్రెండింగ్‌లో కల్పిక
అది అలా ఉంచితే... సినీ నటి కల్పిక (Kalpika Ganesh) అనగానే ఒకప్పుడు అయితే ఎవరామె? అని అడిగినవాళ్లే ఎక్కువ. అయితే ఇప్పుడు మాత్రం ఓహో ఆ అమ్మాయా? పబ్‌లో గొడవపడింది ఆమెనా? అని వెంటనే గుర్తుపడుతున్నారు. మరి ఇలాంటి ప్రచారం ఆమె కెరీర్‌కు ఎంతవరకూ ఉపకరిస్తుందో ఆమెకే తెలియాలి కానీ.. ఆమె వ్యక్తిగత జీవితానికి ఏ మాత్రం ఉపకరించదని పోలీసులు తమ చర్యల ద్వారా తేల్చి చెప్పారు.

చిలికి చిలికి గాలివానలా..
హైదరాబాద్‌ నగరంలో ప్రిజమ్‌ పబ్‌ అంటే తెలియని పార్టీ ప్రియులు ఉండరు. ఓ రకంగా చెప్పాలంటే వందకు పైగా పబ్స్‌ ఉన్న సిటీలో టాప్‌ 5 ప్లేస్‌లో ఉంటుంది. అలాంటి చోటకి వెళ్లి తాను సెలబ్రిటీని కాబట్టి బర్త్‌డే కేక్‌ తనకు కాంప్లిమెంట్రీ ఇవ్వాలని అడగడం, దానికి తాము ఒప్పుకోకపోవడంతో  కల్పిక గొడవ సృష్టించారని పబ్‌ సిబ్బంది ఆరోపణ... ఆ గొడవ చిలికి చిలికి గాలివానలాగా మారింది అనడం కన్నా కల్పిక తన ఇంటర్వ్యూల ద్వారా సోషల్‌ వేదికలపై హల్‌ చల్‌ ద్వారా మరింత రచ్చ చేసింది అనడం సబబుగా ఉండొచ్చు.

కల్పికపై కేసు
ఆ వివాదం ద్వారా ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేసింది కల్పిక. దాదాపుగా ఓ వారం రోజుల పాటు ఆ వివాదం సజీవంగా ఉండేలా తన వంతు సఫలయత్నం చేసిందామె. ఏమైతేనేం.. జనం కొత్త వివాదాల అన్వేషణలో తలమునకలవడంతో ప్రస్తుతం కల్పిక వ్యవహారం కాస్త సద్దుమణిగింది. అయితే పబ్‌లో గొడవను సామరస్యంగా పరిష్కరిద్దామని తాము చూస్తే ఆ సందర్భంగా కల్పిక తమపై వీరంగం చేసిందనే అభిప్రాయంతో ఉన్న పోలీసులు మాత్రం విషయాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేదు. పకడ్బందీగా కేసు తయారు చేసి కల్పికను బుక్‌ చేసేశారు. గత నెలాఖరులో ప్రిజం పబ్‌లో అల్లర్లు సృష్టించిందనే ఆరోపణలతో నటి కల్పిక గణేష్‌పై గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

పోలీసుల ఎదుటే రెచ్చిపోయిన బ్యూటీ
పబ్‌లో గొడవ జరుగుతుందనే సమాచారం మేరకు తాము సంఘటనా స్థలానికి చేరుకున్నామని అయితే తమ సమక్షంలోనే నటి పబ్‌ సిబ్బందిని దుర్భాషలాడిందని కేసు పెట్టారు. అంతేకాక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడానికి కోర్టు నుంచి పోలీసులు అనుమతి కోరారు. అనంతరం గురువారం కోర్టు అనుమతి పొందిన తర్వాత పోలీసులు ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో.. విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలని కల్పికకు పోలీసులు రేపో మాపో నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ వివాదాన్ని కల్పిక ఇకపై ఎలా ముగించబోతోంది అనేది వేచి చూడాల్సి ఉంది.

చదవండి: బొమ్మలా నిల్చున్న జైనబ్‌.. తమన్‌ ఇచ్చిన గిఫ్ట్‌ ఏంటో తెలుసా?

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు