Breaking News

'ప్రావింకుడు షప్పు' సినిమా రివ్యూ (ఓటీటీ)

Published on Sat, 04/12/2025 - 14:48

మలయాళ ఇండస్ట్రీ నుంచి ఎప్పటికప్పుడు సరికొత్త థ్రిల్లర్ సినిమాలు వస్తూనే ఉంటాయి. చాన్నాళ్లుగా ఈ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా అలా 'ప్రావింకుడు షప్పు' పేరుతో ఓ డార్క్ క్రైమ్ థ్రిల్లర్ సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఇది ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) 

కథేంటి?
అడవికి సమీపంలో ఓ ఊరు. బాబు (శివజిత్) ఓ కల్లు దుకాణం నడుపుతూ ఉంటాడు. ఓ రోజు రాత్రి వర్షం కురుస్తుండటంతో ఇతడి షాపులో 11 మంది తాగుతూ తెల్లారేవరకు ఉండిపోతారు. ఓ సందర్భంగా బయటకొచ్చి చూస్తే బాబు.. దూలానికి కట్టిన ఉరితాడుకు వేలాడుతుంటాడు. దీంతో దర్యాప్తు చేయడానికి వచ్చిన పోలీస్ అధికారి సంతోష్ (బాసిల్ జోసెఫ్).. ఇది హత్య అని నిర్ధారిస్తాడు. 11 మందిలోనే నిందితుడు ఉన్నాడని అనుమానపడతాడు. చివరకు హత్య చేసినవాడు దొరికాడా? బాబుతో సునీ (చెంబన్ వినోద్), కన్నా (షౌబిన్ సాహిర్)కి గొడవేంటి? అనేదే మిగతా స్టోరీ. 

ఎలా ఉందంటే?
సింపుల్ గా చెప్పుకొంటే.. ఓ మారుమూల గ్రామం, ఓ రాత్రి జరిగిన హత్య, 11 మంది అనుమానితులు.. మరి హంతకుడిని పోలీసులకు పట్టుకున్నారా లేదా ‍అనేదే స్టోరీ. మలయాళంలో ఇదివరకే ఇలాంటి పాయింట్ తో చాలా సినిమాలు తీశారు. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో చెబుతారు. ఈ మూవీ విషయానికి వచ్చేసరికి డార్క్ క్రైమ్ జానర్ ని ఎంచుకున్నారు. కాకపోతే ఓకే ఓకే అనిపించేలా మాత్రమే తీయగలిగారు.

(ఇదీ చదవండి: 'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు) 

హత్య కేసులో 11 మంది అనుమానితులని విచారించినప్పుడు, వాళ్ల నుంచి ఒక్కో క్లూని లాగుతున్నప్పుడు సీన్స్ థ్రిల్లింగ్ గా అనిపించాలి. కానీ ఇందులో చాలాచోట్ల విసుగు పుడుతుంది. తొలుత కల్లు దుకాణంలో పనిచేసే కన్నాని పోలీసులు అనుమానిస్తారు. తర్వాత కాసేపటి సునీ అనే వ్యక్తిపై సందేహం వస్తుంది. తర్వాత మెరిండా అనే పాత్ర ఎంటరవుతుంది. వీళ్లలో దొంగ ఎవరనేది మూవీ చూసే తెలుసుకోవాలి.

కథ పరంగా పెద్దగా ఆకట్టుకోనప్పటికీ సాంకేతికంగా మాత్రం అలరిస్తుంది. విజువల్స్ తో పాటు నేపథ్య సంగీతం బాగుంది. లొకేషన్స్ కూడా డిఫరెంట్ గా అనిపిస్తాయి. డైరెక్టర్ ఇంకాస్త శ్రద్ధ పెట్టి సరైన సీన్స్ రాసుకుని ఉంటే మంచి థ్రిల్లర్ అయ్యేది.

నటీనటుల విషయానికొస్తే.. విచిత్రంగా ప్రవర్తించే పోలీస్ అధికారి సంతోష్ గా బాసిల్ జోసెఫ్ నటన ఆకట్టుకుంది. కన్నా పాత్రలో సౌబిన్ షాహిర్, సునీ పాత్రలో చెంబన్ వినోద్ చెప్పుకోదగ్గ పాత్రలు. వాటిని సునాయసంగా చేసుకుంటూ వెళ్లిపోయారు. మిగతా పాత్రధారులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఓవరాల్ గా చెప్పుకొంటే.. రీసెంట్ టైంలో వచ్చిన మలయాళ థ్రిల్లర్స్ తో పోలిస్తే ఇది తేలిపోయింది. టైమ్ పాస్ కోసం చూద్దామనుకుంటే మాత్రం ఓసారి ట్రై చేయొచ్చు.

-చందు డొంకాన

(ఇదీ చదవండి: జాన్వీ కపూర్‌కు లంబోర్గిని కారు గిఫ్ట్‌) 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)