Breaking News

కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ?.. డిప్యూటీ సీఎం పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు!

Published on Tue, 10/01/2024 - 14:55

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ మరో ట్వీట్ చేశారు. ఈ విషయంలో సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేసిన ప్రకాశ్‌ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

'కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి' అంటూ తెలుగులో ట్వీట్‌ చేశారు. కాగా.. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ తిరుమల లడ్డు విషయంలో దీక్షలు చేస్తానంటూ మీడియా ముందుకొచ్చి మరీ ప్రకటించారు. లడ్డూ ప్రసాదం వివాదం గురించి ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌కు ప్రకాశ్‌ రాజ్‌ పలుసార్లు కౌంటరిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీం వ్యాఖ్యలతో మరోసారి పవన్‌కు తనదైన శైలిలో చురకలంటించారు.

(ఇది చదవండి: 'జస్ట్ ఆస్కింగ్' అంటూ మరోసారి ట్వీట్‌ చేసిన ప్రకాశ్‌ రాజ్‌)

సోమవారం సుప్రీం కోర్టులో లడ్డు అంశంపై విచారణ జరిగింది. దేశ ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ‍ప్రసాదంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయా..? అంటూ కోర్టు ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలంటూ హెచ్చరించింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై వెంటనే నటుడు ప్రకాశ్‌ రాజ్‌ రియాక్ట్‌ అయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ.. 'దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి'   అంటూ పోస్ట్‌ చేశారు. 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)