Breaking News

టికెట్ రేట్లు ఎ‍క్కువ ఉంటే సినిమాలు చూడకండి: ప్రకాశ్ రాజ్

Published on Sat, 12/27/2025 - 19:10

టాలీవుడ్‌లో ఈ ఏడాది ఏదైనా ఓ విషయం గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారంటే అది టికెట్ రేట్ల గురించే. పెద్ద సినిమాల రిలీజయ్యే ప్రతిసారి ఈ అంశం పెద్ద చర్చకు దారితీసింది. కొన్నిసార్లు అయితే ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం లాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై ఇప్పటికే చాలా అభిప్రాయాలు వినిపించాయి. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ మాత్రం టికెట్ ధరలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

(ఇదీ చదవండి: చరణ్‌కి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో సల్మాన్ సినిమా.. టీజర్ రిలీజ్)

సీఐటీయూ మహాసభల కోసం వైజాగ్ వచ్చిన ఈ నటుడు.. మీడియాతో మాట్లాడారు. మహిళలపై శివాజీ చేసిన చిల్లర వ్యాఖ్యల గురించి ఘాటుగా స్పందించారు. పురుషుల వల్ల మహిళలకు తరతరాలుగా అన్యాయం జరుగుతోంది, ఓ వేదికపై అభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ విషయంలో అనసూయకే సపోర్ట్ చేస్తానని చెప్పారు. ఐబొమ్మ రవి దొంగతనం చేశాడని, అది ముమ్మాటికీ తప్పే అని చెప్పుకొచ్చాడు.

ఇలా మాట్లాడుతున్న టైంలోనే.. సినిమా టికెట్ ధరలు ప్రేక్షకులకు భారంగా మారుతున్నాయి? దీనిపై మీ స్పందన ఏంటని ప్రకాశ్ రాజ్‌ని అడగ్గా.. అయితే సినిమాలు చూడకండి. ఎవరి వ్యాపారం వాళ్లది అని కుండబద్దలు కొట్టేశాడు. చూస్తుంటే ఈ వ్యాఖ్యలు కచ్చితంగా వివాదానికి దారితీసేలా ఉన్నాయి. ఎందుకంటే ప్రేక్షకుడిని థియేటర్‌కి ఎలా తీసుకురావాలా అని నిర్మాతలు ఆలోచిస్తుంటే.. ఈ నటుడు మాత్రం ఇలా ఆశ్చర్యకర కామెంట్స్ చేశాడు.

(ఇదీ చదవండి: ఐసీయూలో టాలీవుడ్ 'చిన్న' సినిమా)

Videos

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)