Breaking News

అనుష్క కోసం రంగంలోకి దిగిన ప్రభాస్‌

Published on Thu, 09/07/2023 - 07:13

టాలీవుడ్​ బ్యూటీ అనుష్క శెట్టి ఐదేళ్ల తర్వాత వెండితెరపై కనిపించనున్నారు. యంగ్​ హీరో నవీన్​ పోలిశెట్టి కీలక పాత్రల్లో నటించిన 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'తో ఆమె మళ్లీ ప్రేక్షకులను మెప్పించనున్నారు. యూవీ క్రియేషన్స్‌ పై వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు (సెప్టెంబర్‌ 7న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా హీరో నవీన్​ ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని పలు ప్రదేశాలకు తిరిగి భారీగా సినిమాను ప్రమోట్​ చేయగా.. హీరోయిన్​ అనుష్క కూడా వినూత్నంగా ప్రమోట్​ చేస్తూ  అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే ఈ సారి అనుష్క కోసం ప్రభాస్​ రంగంలోకి దిగారు. అనుష్క సినిమా కోసం ఆయన చేసిన ఓ పని నెట్టింట ట్రెండ్ అవుతోంది.

(ఇదీ చదవండి: ‘జవాన్‌’మూవీ ట్విటర్‌ రివ్యూ)

'మిస్​ శెట్టి మిస్టర్​ పోలిశెట్టి' సినిమాలో అనుష్క చెఫ్‌ పాత్రలో కనిపించనున్నారు. దీంతో తాజాగా అనుష్క ఒక వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. తనకు ఇష్టమైన వంటకం అయిన మంగుళూరు చికెన్‌ కర్రీ, నీర్‌ దోశ ఎలా చేయాలో తయారీ విధానాన్ని అభిమానులతో ఇలా పంచుకున్నారు.

(ఇదీ చదవండి: ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ ట్విటర్‌ రివ్యూ)

'చెఫ్‌ పాత్రలో చేయడం నాకు ఇదే తొలిసారి. ఇది నా బెస్ట్‌ మూవీలా ఫీలవుతున్నాను. దీంతో సోషల్‌ మీడియా ద్వారా ఓ కొత్త ఛాలెంజ్‌ను మొదలు పెడుతున్నాను. ఇందులో ప్రభాస్‌ పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. భోజనాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తి ఆయన... ఇప్పుడు తనకు ఇష్టమైన వంటకాన్ని ఎలా తయారు చేస్తారో ఆయన పోస్టు పెట్టాలి.' అని ప్రభాస్‌ను అనుష్క ట్యాగ్‌ చేశారు.

ప్రభాస్‌ రియాక్షన్‌
అనుష్క విసిరిన  ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రభాస్‌ వెంటనే ఇన్‌స్టాలో తన ఫేవరట్​ రెసిపీని పోస్ట్‌ చేశారు. రొయ్యల పులావ్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన తయారీ విధానాన్ని కూడా ఆయన షేర్‌ చేశారు. ఆ తర్వాత ఈ ఛాలెంజ్‌ను గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు విసురుతున్నట్లు ప్రభాస్‌ చెప్పారు. ఇలా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ ఛాలెంజ్‌ ట్రెండింగ్‌లో ఉంది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కూడా ఆ పోస్ట్‌ను నెట్టింట తెగ షేర్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ ఎంట్రీ ఇచ్చాడంటే అనుష్క సినిమాకు భారీగా ప్రమోషన్‌ దక్కినట్లేనని వారు కామెంట్లు చేస్తున్నారు.


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)