Breaking News

ఎట్టకేలకు 'రాజాసాబ్' ఓటీటీ డీల్ క్లోజ్

Published on Fri, 12/05/2025 - 18:52

ప్రభాస్ ప్రస్తుతం 'స్పిరిట్' షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మరోవైపు ఇతడి నుంచి 'రాజాసాబ్' మరో నెల రోజుల్లో థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల క్రితం తొలుత ట్రైలర్, తర్వాత ఓ పాటని రిలీజ్ చేశారు. అలానే ఓవర్సీస్‌లో టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. అయితే ఓటీటీ డీల్ మాత్రం పెండింగ్‌లో ఉండిపోయింది. ఇ‍ప్పుడు అది ఎట్టకేలకు పూర్తయిపోయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?

(ఇదీ చదవండి: సమంత రాజ్.. నో హనీమూన్, నో రిలాక్స్)

ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తీసిన హారర్ ఫాంటసీ మూవీ ఇది. కొన్నాళ్ల ముందు రిలీజ్ చేసిన ట్రైలర్‌తో కంటెంట్ ఏంటనేది చూచాయిగా క్లారిటీ వచ్చేసింది. హారర్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫాంటసీ అంశాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ క్రమంలోనే ముంబైకి చెందిన ఓ సంస్థ కూడా ఈ సినిమా కోసం పెట్టుబడి పెట్టింది. సదరు ముంబై కంపెనీకి సంబంధించిన మొత్తాన్ని తిరిగిచ్చే విషయంలో కాస్త ఆలస్యమైనట్లు తెలుస్తోంది. దీంతో ఓటీటీ డీల్ పెండింగ్‌లో ఉండిపోయింది.

ఇప్పుడన్నీ సమస్యలన్నీ క్లియర్ కావడంతో 'రాజాసాబ్' డిజిటల్ హక్కుల్ని జియో హాట్‌స్టార్ ఓటీటీ.. భారీ ధరకు సొంతం చేసుకుంది. మరి 6 వారాలకు ఒప్పందం కుదుర్చుకున్నారా లేదంటే 8 వారాలకు కుదుర్చుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించాడు. జనవరి 9న పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.

(ఇదీ చదవండి: బోల్డ్ వెబ్ సిరీస్.. ఫైనల్ సీజన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)