పక్క ఇల్లు కూల్చేయడం కరెక్ట్ కాదు.. పూనమ్ పోస్ట్ ఎవరి గురించి?

Published on Tue, 12/02/2025 - 10:55

టాలీవుడ్‌లో అప్పట్లో హీరోయిన్‌గా పలు సినిమాలు చేసిన పూనమ్ కౌర్.. ఎప్పటికప్పుడు ఏదోలా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్‌పై గతంలో పలుమార్లు సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతానికి యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది. కానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ట్వీట్ చేస్తూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే ఓ మహిళ గురించి పరోక్షంగా ప్రస్తవించింది.

(ఇదీ చదవండి:  సమంతకు ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం అయిపోయిందా?)

'మన ఇల్లు బాగుండాలని పక్క ఇల్లు కూల్చేయడం సరికాదు. అది కూడా ఓ శక్తిమంతమైన బాగా చదువుకున్న ఎక్కువ ప్రాధాన్యం గల మనిషి ఇలా చేయడం చాలా బాధాకరం. డబ్బు ఏదైనా చేయిస్తుంది' అని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. సరిగ్గా ఈమె ట్వీట్ చేసినప్పుడే సమంత మరో పెళ్లి చేసుకుంది. దీంతో పూనమ్.. సమంతని ఉద్దేశిస్తూనే ఈ ట్వీట్ పెట్టిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సమంతకు ఇది రెండో పెళ్లి. 'ద ఫ్యామిలీ మ్యాన్' దర్శకుల్లో ఒకడైన రాజ్ నిడిమోరునే వివాహం చేసుకుంది. రాజ్‌కి కూడా ఇది రెండో పెళ్లినే. 2015లో శ్యామోలి అనే మహిళతో ఇతడికి పెళ్లి జరిగింది. ఆమెకు మూడేళ్ల క్రితమే విడాకులు ఇచ్చేశాడని అంటున్నారు గానీ దాని గురించి పెద్దగా క్లారిటీ లేదు. అలాంటిది ఇ‍ప్పుడు సామ్-రాజ్.. ఈశా ఫౌండేషన్‌లోని ఓ ఆశ్రమంలో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సమంతనే బయటపెట్టింది. కొన్ని ఫొటోలు కూడా పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: నువ్వు ఇంటికెళ్లిపో.. తనూజ, సుమన్ శెట్టి ఇలా షాకిచ్చారేంటి?)

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)