Breaking News

'పెద్ది' నుంచి సర్‌ప్రైజ్.. జాన్వీ కపూర్ పోస్టర్స్ రిలీజ్

Published on Sat, 11/01/2025 - 15:25

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. తెలుగులో చేస్తున్న రెండో సినిమా 'పెద్ది'. రామ్ చరణ్ హీరోగా నటిస్తుండగా.. షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ నెలలో తొలి పాట రిలీజ్ చేస్తారనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా జాన్వీ కపూర్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో చిన్న హింట్ ఇచ్చారు.

(ఇదీ చదవండి: 'మాస్ జాతర' కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?)

'దేవర'లో ఎన్టీఆర్ సరసన పల్లెటూరి అమ్మాయిలా చేసిన జాన్వీ కపూర్.. 'పెద్ది'లోనూ దాదాపు అలాంటి రోల్ లోనే కనిపించనుంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్‌తో క్లారిటీ వచ్చేసింది. అచ్చియమ్మ అనేది జాన్వీ పాత్ర పేరు. చూస్తుంటే ఈమెది మైక్ సెట్టింగ్ నిర్వహించే పాత్రలా కనిపిస్తుంది. కొన్నిరోజులు ఆగితే ఈ విషయమై క్లారిటీ రావొచ్చు.

'పెద్ది' మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా కాగా.. 'మీర్జాపుర్' ఫేమ్ దివ్యేందు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమన్ సంగీతమందిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకుడు. వచ్చే మార్చి 27న మూవీని థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. కానీ షూటింగ్స్‌లో కాస్త ఆలస్యమవుతోందనే టాక్ వినిపిస్తుంది. మరి అనుకున్న తేదీకి వస్తారా లేదంటే వాయిదా పడొచ్చా అనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించాక తొలిసారి కనిపించిన ఉపాసన)

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)